తమిళనాట ఏడాదిగా రాజకీయ పరిణామాలు ఎలా వేగంగా మారిపోతున్నాయో తెలిసిందే. ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి రజినీకాంత్.. కమల్ హాసన్ లాంటి బడా స్టార్లు ముందుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్లిద్దరి తర్వాత తమిళనాట తిరుగులేని ఆదరణ ఉన్న హీరో విజయ్. అతను కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందన్న చర్చ కొంత కాలంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలవడం చర్చనీయాంశమైంది. దీనిపై రోజులుగా ఊహాగానాలు చెలరేగాయి.
ఐతే దీనిపై విజయ్ వైపు నుంచి వివరణ వచ్చింది. విజయ్ సినిమా విషయంగానే పళనిస్వామిని కలిసినట్లు వెల్లడైంది. తమిళనాట రాష్ట్ర ప్రభుత్వం సినిమాలపై విధిస్తున్న 10 శాతం వినోదపు పన్నును 8 శాతానికి తగ్గించిన నేపథ్యంలో కృతజ్నతలు చెప్పడానికే విజయ్.. ‘మెర్శల్’ దర్శకుడు అట్లీతో కలిసి సీఎంను కలిసినట్లుగా మంత్రి ఒకరు చెప్పారు. ఐతే ‘మెర్శల్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యమవుతుండటంపైనా సీఎంతో విజయ్ చర్చించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో జల్లికట్టు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలుంటాయి. ఇందుకోసం జంతువుల్ని హింసించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో జంతు సంక్షేమ సంస్థ నుంచి ఎన్వోసీ రాలేదట. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ విషయం మీదా విజయ్ పళనిస్వామితో చర్చించినట్లు తెలుస్తోంది.