అనుమ‌తి లేకుండా అందాల్ని ఎడిట్ చేశారని న‌టి ఆరోప‌ణ‌

Update: 2021-03-03 13:30 GMT
డిజిట‌ల్ ప‌ర్య‌వ‌సానం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఫోటోమార్ఫింగ్ - అధునాత ఎడిటింగ్ సాంకేతిక‌త‌తో హ‌ద్దులు మీరిన‌ విశృంఖ‌ల‌త మ‌గువ‌ల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఆ కోవ‌లోనే త‌న అందాల్ని ఎడిట్ చేశారంటూ తాజాగా ప్ర‌ముఖ న‌టి ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది. పోస్ట‌ర్ల‌లో త‌న అందాల్ని రెట్టింపు చేసేందుకు ఎడిటింగ్ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించార‌ని స‌ద‌రు న‌టీమ‌ణి ఆరోపించారు. పోస్టర్లలో పెద్దవిగా కనిపించేలా వ‌క్షోజాలను ఎడిట్ లో సవరించారని ఆవేద‌న చెందారు. తాను త‌న‌లా క‌నిపించ‌డం లేదు.. అంటూ క‌ల‌త చెందారు. ఇంత‌కీ ఎవ‌రా న‌టి? అంటే..

ప్ర‌ముఖ హాలీ‌వుడ్ న‌టి `గాన్ గ‌ర్ల్` ఫేం రోసముండ్ పైక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త‌న గోడు వెల్ల‌బోసారు. చాలా సినిమా పోస్టర్లలో న‌టీమ‌ణుల ఒరిజిన‌ల్ రూపాన్ని క‌నిపించ‌నీకుండా డిజిటల్ సాంకేతిక‌త‌తో మార్చేస్తున్నార‌ని ఒరిజినాలిటీ లేద‌ని వాపోయారు. కొన్ని సినిమా పోస్టర్ల కోసం త‌న‌ వక్షోజాలను కూడా పెద్ద‌విగా మార్చార‌ని.. అందుకు ముందస్తు అనుమతి తీసుకోలేద‌ని కూడా తెలిపారు. 2011 కామెడీ మూవీ `జానీ ఇంగ్లీష్ రిబార్న్` కోసం పోస్టర్ ‌లో తన ఎద అందాలను ఎలా స‌వ‌రించింది వివ‌రించారు. నిజ జీవితంలో అలా లేను క‌దా అని అన్నారు.

`రేడియోయాక్టివ్` అనే 2020 చిత్రం పోస్టర్ కోసం ఆమె కళ్ళు ఆకుపచ్చ నుండి గోధుమ రంగులోకి మారిపోయాయని కూడా వెల్ల‌డించారు. ఇందులో ఆమె శాస్త్రవేత్త మేరీ క్యూరీ పాత్ర పోషిస్తుంది. ఆ మూవీలో మారిన త‌న రూపాన్ని చూసి షాక్ తిన్నాన‌ని వెల్ల‌డించారు. ఒక‌సారి ఓ వ్య‌క్తి విమాన ప్ర‌యాణంలో ఉన్న‌ప్పుడు తన సెల్ఫీని ఫేస్ ట్యూన్ చేయమని అడిగారు. ఆమె ఫేస్ ట్యూనింగ్ గురించి తెలుసుకుని షాక‌య్యార‌ట‌. ఇంతకుముందు పాప్ స్టార్ లేడీ గాగా.. జెండయా.. జమీలా జమిల్ వంటి ప్రముఖులు తమను డిజిటల్ లో పూర్తిగా స‌వ‌రించార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మే అయ్యింది.
Tags:    

Similar News