కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఏంటో హీరోయిన్ అమలాపాల్ ను చూసి అర్ధం చేసుకోవచ్చు. తన స్థాయికి చిన్న మొత్తానికి కక్కుర్తి పడడం కారణంగా.. నానా అగచాట్లు పడుతోంది ఈ భామ. తన సొంత నివాసం ఉన్న ప్రాంతంలో కాస్ట్లీ కార్ రిజిస్టర్ చేయించడం కంటే.. పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ ద్వారా లక్షలు మిగుల్చుకోవచ్చని ప్రలోభపడింది అమలాపాల్.
కానీ ఈ విషయం వివాదంగా మారి.. విచారణకు దారి తీసి.. కోర్టు వరకూ చేరుకుంది. ఫలానా రోజున విచారణకు రావాలని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు చెబితే.. వారికి ఝలక్ ఇవ్వడంతో.. కోర్టు మొట్టికాయలు పడ్డాయి. ఇప్పుడు బుద్ధిగా వచ్చి విచారణకు హాజరు కావడం అమలాపాల్ కు తప్పలేదు. అయితే.. ఇక్కడ కూడా తను పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ కోసం సబ్మిట్ చేసిన ఇంటిని తాను రెంట్ కు తీసుకున్నానని ఢంకా బజాయించి మరీ విచారణ అధికారులకు చెబుతోందట. అఫ్ కోర్స్.. ఈమె వాదనకు వాళ్లేమీ కన్విన్స్ అయిపోలేదు కానీ.. అమలను అంత తేలికగా వదిలేసే ఉద్దేశ్యం మాత్రం లేదని అంటున్నారు.
అమలాపాల్ అందించినవి తప్పుడు ధృవపత్రాలు అనే ఆధారాలు వీరి దగ్గర ఉండడంతో.. పలు కేసుల కింద ఈమెపై కేసులు మోపబోతున్నారట. విచారణకు సహకరించకపోవడం కారణం చూపి.. అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమయినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పన్నుతో పోయే దానికి ఊచల వరకు తెచ్చుకుంది అమలాపాల్.