ఒక్క డిజాస్టర్ ఎంతో మంది కెరీర్ లని ప్రశ్నార్థకంలో పడేస్తుంది. ఇది ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా జరుగుతూనే వుంది. హిట్ వస్తే ఆకాశానికి ఎత్తేయడం.. ఫ్లాప్ ఎదురైతే పెద్దగా పట్టించుకోకపోవడం తెలిసిందే. కానీ ఒక్క డిజాస్టర్ డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ లని తీవ్ర అగాధంలోకి నెట్టేసింది. అదే `లైగర్`. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీని వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు.
విజయ్ దేవరకొండ మూడున్నరేళ్లు ఈ మూవీ కోసం శ్రమించాడు. కానీ ఫలితం శూన్యం. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే అ మూవీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది. వసూళ్ల పరంగానూ డిస్ట్రిబ్యూటర్లకు, పూరి జగన్నాథ్, చార్మిలకు భారీ నష్టాలని తెచ్చిపెట్టింది. రికవరీల విషయంలో వివాదం తలెత్తడం.. పూరీని శోభన్ బాబు అనే డిస్ట్రిబ్యూటర్ తో రికవరీ విషయంతో పూరికి మనస్పర్థలు తలెత్తడంతో వివాదం పోలీస్టేషన్ దాకా వెళ్లింది.
తనకు ప్రాణహానీ వుందంటూ కొంత మందిపై పూరి జగన్నాథ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా వుంటే ఈ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైందని తెలుస్తోంది. అనన్య మీద `లైగర్` దెబ్బ గట్టిగా పడింది అంటున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకోవాలని భారీ ఆశలు పెట్టుకున్న అనన్న పాండేకు ఈ మూవీ షాకిచ్చింది.
ఈ మూవీకి తనే ప్రధాన మైనస్ అని ప్రేక్షకులు తేల్చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా ప్రచారం చేశారు. చూపుకే తప్ప అనన్యలో యాక్టింగ్ స్కిల్స్ ఏమీ లేవని, తన వల్లే కొన్ని సీన్ లు తేలిపోయాయి ట్రోల్ చేశారు. హిందీలో అనన్య చేతిలో ఒకే ఒక మూవీ వుంది. `డ్రీమ్ గాళ్ 2` పేరుతో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది.
దీని తరువాత తనకు ఆఫర్ ఇచ్చేవాళ్లే కనిపించడం లేదట. దీంతో బాలీవుడ్ లో అయినా అవకాశాల్ని దక్కించుకోవాలని వరుస ఫొటో షూట్ లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయినా ఎవరు అనన్యని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View