కరోనా వేళ డాక్టర్ల సేవలను అంతా కొనియాడుతున్నారు. కానీ కొందరు డాక్టర్లు, కొన్ని ఆస్పత్రులు మాత్రం.. సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. కరోనా వేళ.. అవసరం ఉన్నా లేకున్నా.. ఎడా పెడా రెమిడెసివిర్ ఇంజెక్షన్లు కుచ్చి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు కొందరు డాక్టర్లు. మందే లేని కరోనాకు రూ. లక్షల బిల్లు ఎలా అవుతుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.. ఈ ప్రశ్నకు డాక్టర్లు, ఆస్పత్రుల యాజమాన్యం నుంచి సమాధానం లేదు.
ఇక కరోనా సెకండ్‌వేవ్ లో మెడికల్ మాఫియా మరింత రెచ్చిపోతున్నది. సామాన్యులు ఆస్తులు అమ్ముకొని మరీ.. ఆస్పత్రి బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదు. గాంధీ లాంటి ఆస్పత్రులను మినహాయిస్తే.. జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు వసతులు లేవు. ఇక ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రుల వ్యాపారం మొదలుపెట్టారు. ఆస్పత్రిలో చేరేందుకే రూ. లక్షలు ఫీజు వసూలు చేస్తున్నారు.అయితే కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి సాధారణ జనంతో పాటు సెలబ్రిటీలు సైతం బలవుతున్నారు.
తాజాగా బుల్లితెర నటి సంభావన సేత్.. మెడికల్ మాఫియాపై విరుచుకుపడింది. ఇటీవల తన తండ్రి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే అందుకు కారణం డాక్టర్లేనంటూ సంభావన మండిపడింది. తన తండ్రికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినా.. డాక్టర్లు పట్టించుకోలేదని, సరైన వైద్యం అందించలేదని, అందుకే తనతండ్రి మరణించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘డాక్టర్లంతా మంచివాళ్లేనని మనం అనుకుంటాం. కానీ కొందరు దుర్మార్గులు, రాక్షసులైన డాక్టర్లు కూడా ఉంటారు’ అంటూ ఆమె మండిపడ్డారు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ లో సంభావన ఓ వీడియోను పోస్టు చేసింది.
ఇటీవల సంభావన తన తండ్రిని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడి డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే తన తండ్రి మృతిచెందాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఆ మేరకు ఆమె ఆస్పత్రికి నోటీసులు కూడా పంపించారు. ‘ మీలో చాలా మంది నా లాగే ఇబ్బందిని ఎదుర్కొని ఉంటారు. కానీ వివిధ కారణాలతో మీరు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టి ఉండకపోవచ్చు. దయచేసి నాకైనా మద్దతు ఇవ్వండి. మెడికల్ మాఫియాపై మనం పోరాడదాం’ అంటూ ఆమె వీడియోలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Full View