2011లో యంగ్ హీరో తనీష్ సరసన `మంచివాడు` అనే చిత్రంలో నటించింది భామ. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. భామ నటనకు గుర్తింపు దక్కినా.. ఫ్లాప్ వల్ల అవకాశాలు రాలేదు. అయితే ఈ అమ్మడికి అప్పటికే మలయాళంలో మాంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ అందరు అగ్ర కథానాయికల్లానే రెండు డజన్ల సినిమాలతో బిజీ నటిగా కొనసాగింది. తమిళం-కన్నడలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
ఎట్టకేలకు 31 ఏళ్ల ఈ అందాల భామ పెళ్లికి రెడీ అవుతోంది. తాను ప్రేమించిన బిజినెస్ మేన్ ని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటోందట. ఆయన పేరు అరుణ్. రిచ్ బిజినెస్ మేన్. అంతకుమించి వివరాలేవీ లేవు. ఇది లవ్ కం ఎరేంజ్డ్ మ్యారేజ్ అన్న సమాచారం ఉంది. ఇకపోతే నైవేద్యం అనే చిత్రంతో మలయాళ సినీరంగంలో ప్రవేశించిన భామ జన ప్రియన్- సైకిల్- సెవెన్స్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
తాజాగా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన సమాచారం అందించింది. మలయాళ కథానాయికల్లో అశిన్.. బాలీవుడ్ నాయికల్లో శిల్పా శెట్టి రిచ్ బిజినెస్ మేన్ లను పెళ్లాడి లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. అదే బాటలో ఈ అమ్మడు బిజినెస్ మేన్ ని ప్రేమించి పెళ్లాడుతోందన్నమాట. అన్నట్టు భామ ఓ ఇంటిదైపోతోంది సరే.. మరి `మంచివాడు` తనీష్ పెళ్లెప్పుడో