కలర్ ఫొటోతో హీరోయిన్ గా మంచి గుర్తింపును అందుకున్న తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి చిన్న తరహా సినిమాలతో బాగానే క్రేజ్ అందుకుంటూ వచ్చింది. ఇక ఆమె నటించిన తదుపరి సినిమా సమ్మతమే కూడా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నా ఈ బ్యూటీ తరచుగా ఒక ప్రశ్నను ఎదుర్కొంటోంది.
ఒక విధంగా ఆమె ఆ ప్రశ్నకు విసుగెత్తిపోయినట్లు ఆమె ఇచ్చిన సమాధానంతో అర్థమైంది. సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో నార్త్ హీరోయిన్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తెలుగు అమ్మాయిలకు ఎందుకు ఇక్కడ ఎక్కువ అవకాశాలు రావు. మీరు అనుకున్నట్లు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తుందా అనే ప్రశ్నను చౌదరి గత కొంతకాలంగా తరచుగా ఇంటర్వ్యూలలో ఎదుర్కొంటోంది.
అయితే చాందిని ఇటీవల సమ్మతమే ఇంటర్వ్యూలో ఆ ప్రశ్నకు విసుగెత్తిపోయిన సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్న నేను చాలా రోజులుగా ఎదుర్కొంటున్నాను. మీరు ఎందుకు ఈ తరహా ప్రశ్నలు మన దర్శకులను అలాగే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునే వారిని ఎందుకు అడగరు అని ఆమె ప్రశ్నించింది. అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో నార్త్ ఇండస్ట్రీ అమ్మాయిలకు ఎలా అవకాశాలు దక్కుతున్నాయి అనే విషయం గురించి నేను పెద్దగా ఆలోచించను.
వాళ్లకు ఎలా అవకాశాలు వస్తున్నాయి అనేది కూడా నాకు అనవసరం. ఆ విషయంపై నేను కామెంట్ కూడా చేయాలని అనుకోవడం లేదు. కానీ తెలుగు అమ్మాయిలకు మాత్రం ఇక్కడ పెద్దగా ఆఫర్స్ రావడం లేదు అనే విషయంలో మాత్రం నేను అప్సెట్ అవుతున్నాను.మ్ అని చాందిని సున్నితంగా సమాధానమిచ్చింది. ఇక ఆమె ఇచ్చిన సమాధానం ఒక విధంగా కరెక్ట్ అని కూడా నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. నిజానికి తెలుగు అమ్మాయిలకు హీరోయిన్స్ గా ఎందుకు ఛాన్స్ లు ఇవ్వరు అనేది దర్శక నిర్మాతలను అడగడం కరెక్ట్ అని అంటున్నారు. మరి భవిష్యత్తులో ఎవరైనా దర్శక నిర్మాతలు ఈ విషయంలో సమాధానం ఇస్తారో లేదో చూడాలి.