స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్'(వారణం ఆయిరం) కథానాయికలలో ఒకరిగా నటించిన దివ్య స్పందన కన్నడ సినీరంగంలో పాపులర్ తారలలో ఒకరు. కర్నాటకలో భారీ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోయిన్. కొన్ని భారీ బ్లాక్ బస్టర్లలో నటించిన దివ్య స్పందన ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి కొంతకాలం పాటు ఎంపీగా కొనసాగారు.
రమ్య సోషల్ మీడియాల్లో అభిమానులతో నిరంతరం టచ్ లో ఉంటారు. తాజాగా సదరు హీరోయిన్ కమ్ పొలిటీషియన్ తన సోషల్ మీడియాలో మహిళల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ప్రతి అంశంలో ఆడవారిని ఎత్తి చూపించేందుకు ప్రపంచం ఎలా ఆరాటపడుతుందో పలువురు నటీమణుల విషయంలో జరిగిన ఉదంతాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు.
విడాకుల విషయంలో సమంతను దారుణంగా ట్రోల్ చేసారని.. రష్మిక కెరీర్ కోసం తన ప్రేమికుడి నుంచి విడిపోవడం పైనా నెటిజనులు ట్రోలింగ్ చేసారని సాయిపల్లవిని కూడా తీవ్రంగా సోషల్ మీడియాల్లో ట్రోల్ చేసారని దివ్య స్పందన తన రాతల్లో పేర్కొన్నారు.
అలాగే 'పఠాన్' కొత్త పాటలో దీపికా పదుకొణె కాషాయ కుంకుమ రంగు బికినీ ధరించడంపై విమర్శలను వివాదాలను ఆమె ప్రస్తావించింది. ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని స్త్రీలు 'దుర్గా మాత స్వరూపం' అని ఆమె రాసింది. స్త్రీ ద్వేషానికి వ్యతిరేకంగా మనమందరం పోరాడాలని దివ్య కోరారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.