సాగరకన్యలా దివి పరువాలు.. స్టన్నింగ్ లుక్స్!

Update: 2023-04-25 18:40 GMT
బిగ్ బాస్ తో ఫేమస్ అయ్యింది నటి దివి. అంతక ముందు కూడా పలు సినిమాల్లో నటించినప్పటికీ, పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్లిందో, ఆమె అందానికి ప్రేక్షకులు ముగ్దులైపోయారు. అప్పటి నుంచి ఆమెకు సోషల్ మీడియాలో క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత పాపకు సినిమా ఛాన్స్ లు కూడా పెరిగాయనే చెప్పొచ్చు.

స్టార్ హీరోలో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తోంది. ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కిందని చెప్పాలి. ఇటీవల పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో అలా తళుక్కున మెరిసింది.  ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది. ఈ అమ్మడుకి సినిమాల్లో కంటే, సోషల్ మీడియాలోనే క్రేజ్ ఎక్కువ అని చెప్పాలి.

ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిందంటే చాలు వైరల్ అయిపోవాల్సిందే. ఎప్పటికప్పుడు హాటు హాటు ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ కాస్ట్యూమ్ లో మెరిసింది. సాగరకన్యలా ముస్తాబై ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఈ ఫోటోలు చూసి కుర్రాళ్లు గుండెలు జారిపోయాయి. పోస్టు చేసిన కొద్ది గంటలకే వేలల్లో లైకులు రాగా, కామెంట్ల వర్షం కురుస్తోంది. దివి సూపర్ హాట్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పుట్టినరోజు కూడా కావడంతో, హ్యాపీ బర్త్ డే అంటూ కూడా విషెస్ తెలియజేస్తున్నారు.

నిజానికి ఈ బ్యూటీది హైదరాబాదే. మొదట మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు చిన్న చిన్నగా, సినిమాల్లోకి అడుగుపెడుతోంది. నెమ్మదిగా ప్రేక్షకులకు చేరువ అవుతోంది. త్వరలోనే ఈ బ్యూటీకి మరింత మంచి ఛాన్స్ లు రావాలని ఆమె ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. ఇక మెగాస్టార్ భోళా శంకర్ లో అమ్మడు ఒక పాత్రలో నటిస్తోంది. మరి ఆ రోల్ అనంతరం కెరీర్ యూ టర్న్ తీసుకుంటుందో లేదో చూడాలి.

Similar News