అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు పార్ట్ లుగా రాబోతున్న పుష్ప మొదటి పార్ట్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సమయంలో చాలా మంది సుకుమార్ గత చిత్రం రంగస్థలంతో పుష్పను పోలుస్తూ చర్చిస్తున్నారు. రంగస్థలంలో రామ్ చరణ్ పాత్ర తరహాలోనే పుష్ప లో అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని.. రెండు కూడా కాస్త పోలికలను కలిగి ఉంటాయని చాలా మంది అనుకుంటున్నారు.
సోషల్ మీడియాలో కూడా మరో రంగస్థలం అన్నట్లుగానే పుష్ప ను ప్రచారం చేస్తున్నారు. రెండు కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ మరియు మాస్ ఎలిమెంట్స్ పుష్పలంగా ఉన్న సినిమాలే అంటూ కొందరు సోషల్ మీడియాలో పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. కాని చిత్ర యూనిట్ సభ్యుల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం రంగస్థలం మరియు పుష్ప సినిమాలు పూర్తి విభిన్నంగా ఉంటాయట. రంగస్థలంకు పుష్పకు అస్సలు ఎక్కడ కూడా పోలిక ఉండదని.. పైగా చిట్టిబాబు పాత్ర మరియు పుష్ప రాజ్ పాత్రలను ఏ విధంగాను పోల్చలేని విధంగా ఉంటుందని అంటున్నారు.
పుష్ప సినిమాలో ఒక చిన్న పాత్రలో నటిస్తున్న దివ్యా అనే నటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప సినిమా కథ పూర్తిగా నాకు తెలియదు. కాని సినిమా షూటింగ్ లో నేను పాల్గొన్నంత వరకు అయితే రంగస్థలం కు పూర్తి విభిన్నంగా ఉందని చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ సర్ లుక్ మరియు ఆయన బాడీలాంగ్వేజ్ ల్లో ఏ ఒక్కటి కూడా చిట్టి బాబు పాత్రకు దగ్గరగా లేవని చెప్పుకొచ్చింది. రంగస్థలం తో అస్సలు పుష్ప ను పోల్చలేమని.. పుష్ప ఒక మాస్ మసాలా మూవీ అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. టీజర్ లో బన్నీ ఎంత మాస్ గా కనిపించారో అంతగా సినిమాలో కూడా ఉంటారని కూడా ఆమె నమ్మకంగా చెప్పుకొచ్చింది.
ఇక అల్లు అర్జున్ ను ఈ సినిమా లో సుకుమార్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. సాదారణంగా తెలుగు సినిమాల్లో హీరోలతో పోల్చితే సుకుమార్ సినిమాలోని హీరోలు చాలా విభిన్నంగా ఉంటారు. నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రను చాలా స్టైలిష్ గా ఆకట్టుకునే విధంగా చూపించిన ఘనత ఆయనకు దక్కింది. అందుకే ఈ సినిమా లో కూడా పుష్ప రాజ్ పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉన్నా కూడా అభిమానులను ఆకట్టుకునే విధంగానే ఈ సినిమాను సుకుమార్ చేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప సినిమా మొదటి పార్ట్ ను డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే అంతుకు ముందే వచ్చినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి పుష్ప సినిమా మరో రంగస్థలం లా హిట్ అవుతుంది కాని.. మరో రంగస్థలం మాదిరిగా ఉండదు అని యూనిట్ సభ్యుల క్లారిటీతో అభిమానులు మరింత ఉత్సాహంగా పుష్ప కోసం వెయిట్ చేస్తున్నారు.
పుష్ప సినిమా లో బన్నీకి జోడీగా ముద్దుగుమ్మ రష్మిక మందన్నా నటించగా కీలక పాత్రలో సునీల్ నటిస్తున్నాడు. ఈయన మెయిన్ విలన్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక రంగస్థలం సినిమా లో కీలక పాత్రలో నటించిన అనసూయ కూడా ఈ సినిమా లో నటిస్తోంది. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా రెండవ పార్ట్ ను కాస్త గ్యాప్ తీసుకుని మొదలు పెట్టబోతున్నారట.