తాగేసి షూటింగ్ లో హీరోయిన్ రచ్చ

Update: 2017-02-02 18:46 GMT
సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక హీరోయిన్స్ హాట్ డ్రింక్స్ పుచ్చుకోవడం.. రెండు మూడు జనరేషన్స్ వెనకనుంచి జరుగుతున్నదే. అయితే.. అలా తాగేసి షూటింగ్ కి వచ్చే హీరోయిన్స్ మాత్రం చాలా చాలా అరుదుగా ఉంటారు. అది కూడా ఫుల్లుగా తాగేసి రావడమే కాదు.. సెట్స్ అంతా రచ్చ చేసేసి.. ఎవరూ కంట్రోల్ చేయలేని సిట్యుయేషన్ క్రియేట్ చేయడం అంటే.. అది కచ్చితంగా పెద్ద విషయమే. ఇలా చేసింది ఎవరో కాదు.. హన్సిక మొత్వానీ.

హన్సిక ఇలా తాగేసి రచ్చ చేసిన విషయం బైట పెట్టింది ఎవరో తెలుసా? స్వయంగా తనే ఈ సంగతి చెప్పింది హన్సిక. బోగన్ మూవీ షూటింగ్ సందర్భంగా ఇలా సెట్స్ కు తాగేసి వచ్చిందట. ఆ రోజు షూటింగ్ లో భాగంగా.. తాగేసి రచ్చ చేయాల్సి ఉంటుందట. అందుకే ముందే ఎంచక్కా ఆల్కహాల్ పట్టించేసి సెట్స్ కు వచ్చిన హన్సిక.. ఆ సీన్ లో జీవించేశానని చెబుతోంది. హన్సిక పరిస్థితి చూసి సెట్స్ లో మిగతా అంతా కంగారు పడినా.. సీన్ బాగా వచ్చినందుకు డైరెక్టర్ మాత్రం ఫుల్లు హ్యాపీగా ఫీలయ్యాడని చెప్పింది హన్సిక.

అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడీ బోగన్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. అరవింద్ స్వామి తన యాక్టింగ్ తో మొత్తం ఫోకస్ తన వైపు తిప్పేసుకోగా.. జయం రవికి కూడా మంచి మార్కులే పడ్డాయి. కానీ హన్సిక రోల్ కి అంతగా రెస్పాన్స్ రాలేదు. సినిమాకి కూడా యావరేజ్ టాక్ వచ్చిందంతే. తెలుగులో లక్కున్నోడుతో లక్ అందుకోలేకపోయిన హన్సిక.. తమిళ్ లో కూడా ఈ ఏడాదిని యావరేజ్ గానే ప్రారంభించింది.
Tags:    

Similar News