న‌లుగురు మ‌గాళ్ల‌ను ఓడించా.. ఇక‌ తీన్మారే! -హేమ‌

Update: 2019-03-11 09:19 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త లేద‌ని ఎన్నిక‌ల ముందు న‌రేష్ ప్యానెల్ స‌భ్యులు విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే జీవిత రాజ‌శేఖ‌ర్ ను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి ఎంపిక చేసుకుని గెలిపించుకుంది ఆ ప్యానెల్. న‌రేష్ అధ్య‌క్షుడిగా, జీవిత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా గెలిచి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతో మ‌హిళ‌ల‌కు స‌ముచిత ప్రాధాన్య‌త పెరిగిన‌ట్ట‌య్యింది. ఇన్నాళ్లు ఈసీ స‌భ్యుల వ‌ర‌కే మ‌హిళ‌లు ప్రాధాన్య‌మ‌య్యార‌న్న అప‌ప్ర‌ద ఇక తొల‌గిపోయిన‌ట్టే. మా ఎన్నిక‌ల్లో గెలిచిన సంద‌ర్భంగా జీవిత మాట్లాడుతూ మా అసోసియేష‌న్ అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌ని మాటిచ్చారు.

ఆస‌క్తిక‌రంగా ఇదే ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ న‌టి హేమ సైతం గెలుపొంద‌డం ఆస‌క్తి రేకెత్తించింది. న‌రేష్ ప్యానెల్.. శివాజీ రాజా ప్యానెల్ .. రెండిటిని ప‌క్క‌న పెట్టి హేమ ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఉత్సాహంలో హేమ తీన్మార్ ఆడినంత ప‌ని చేశారు. న‌లుగురు మ‌గాళ్ల‌పై పోటీ చేసి గెలిచాను. ఈ గెలుపు ప‌రిశ్ర‌మ‌లో ఆడాళ్లంద‌రిదీ. ఇక్క‌డ‌ ద‌రువు అందుబాటులో ఉంటే తీన్మార్ ఆడేదానినే! అంటూ త‌న‌దైన శైలిలో న‌వ్వేస్తూ స‌ర‌దాగా మాట్లాడారు హేమ‌. మ‌హిళ‌లే త‌న‌కు ఓటు వేసి గెలిపించార‌ని వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మూవీ ఆర్టిస్టుల సంఘం పురోభివృద్ధికి కృషి చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు.

రెండు ద‌శాబ్ధాలు పైగా ఒక క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టి హేమ ఉనికిని చాటుకుంటున్నారు. అగ్ర ద‌ర్శ‌కులంద‌రి సినిమాల్లో న‌టించారు. ఇండ‌స్ట్రీలో ఇంత కాంపిటీష‌న్ ఉన్నా.. రెగ్యుల‌ర్ బేసిస్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు పుట్టుకొస్తున్నా.. ఏడాది పొడ‌వునా బిజీగా ఉండే ఆర్టిస్టుగా హేమ చ‌క్రం తిప్పుతున్నారు. గ‌తంలో `మా` క‌మిటీలో సేవ‌లు అందించారు. ఈసారి కూడా స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచి ఉపాధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌డంతో ఆ సంతోషాన్ని తోటి స‌భ్యుల‌తో సెల‌బ్రేట్ చేసుకున్నారు.


Tags:    

Similar News