ముంబయిలోని ఒక హోటల్లో డ్రగ్స్ తో టాలీవుడ్ నటి ఒకరు దొరికిన వైనం పెను సంచలనంగా మారటం తెలిసిందే. అయితే..సదరు నటి ఎవరన్న విసయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. దీంతో.. డ్రగ్స్ తో అధికారులకు దొరిని నటి ఎవరన్నది సస్పెన్స్ గా మారింది. దాదాపు నాలుగు వందల గ్రాముల డ్రగ్స్ తో అధికారులకు దొరికిపోయిన ఆమెకు.. మాఫియా డాన్ కరీం లాలాతోసంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
హోటల్లో డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీలోకి తీసుకుంటూ.. ఆమెను రహస్యంగా తరలించారు. ఈరోజు (సోమవారం) ఆమెను కోర్టుకు హాజరు పరుస్తారని భావించారు. అంతేకాదు.. ఈ దందాలో భాగం ఉందని భావించిన నటికి అన్ని విధాలుగా అండగా ఉన్న మాఫియా డాన్ కరీంలాలా కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఇదిలా ఉంటే..తాజాగా ఆమె అధికారుల కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోయినట్లుగా తేలింది. దీంతో షాక్ తిన్న అధికారులు ఇప్పుడు ఆమెను పట్టుకోవటం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రీల్ లో మాదిరి ఆమెను ఛేజ్ చేసి పట్టుకుంటారో.. అదేమీ అవసరం లేకుండా సింఫుల్ స్కెచ్ తో అదుపులోకి తీసుకుంటారా? అన్నది ప్పుడు తేలాల్సి ఉంది.