తెలుగు తమిళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న కస్తూరి పెళ్లి తర్వాత సినిమాలకు కొన్నాళ్లు దూరం అయ్యారు. కొన్ని సంవత్సరాల వరకు విదేశాలకే పరిమితం అయిన కస్తూరి ప్రస్తుతం సినిమాల్లో మరియు బుల్లి తెరపై సందడి చేస్తున్నారు. సీరియల్స్ లో నటించడంతో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్న కస్తూరి సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉన్నారు. హీరోయిన్ గా ఒకప్పుడు స్టార్ గా వెలుగు వెలిగిన కస్తూరి ఇప్పుడు కూడా నటిగా బిజీ బిజీగా కొనసాగుతూ సెకండ్ ఇన్నింగ్స్ లో మోస్ట్ వాంటెడ్ నటిగా దూసుకు పోతున్నారు. కస్తూరి ఇంటర్వ్యూలు కూడా ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నటిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వచ్చిన కస్తూరి కెరీర్ లో ఎన్నో పుకార్లు పుట్టుకు వచ్చాయి. ముఖ్యంగా అప్పట్లో ఒక హీరోతో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత చెన్నైకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో కస్తూరి ప్రేమ వివాహం అవ్వబోతుందని కూడా వార్తలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అప్పటి తనపై పుకార్ల గురించి తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో కస్తూరి సరదాగా స్పందించింది. తనకు సంబంధించినంత వరకు మీడియాలో వచ్చిన వార్తలన్నింటిని కూడా పుకార్లుగానే కొట్టి పారేసింది.
హీరోయిన్ గా తాను ఒక హీరోతో మూడు సినిమాలు వరుసగా చేశాను. దాంతో ఆయనకు నాకు మద్య ఏదో ఉందని.. ఆయన నాకు డైమండ్ నక్లెస్ గిప్ట్ గా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చినప్పటి నుండి కూడా నేను ఆ హీరోను కలిసిన సమయంలో నా డైమండ్ నక్లెస్ ఎక్కడ.. మీడియాలో వచ్చిన వార్తలు నిజం చేయవచ్చు కదా అంటూ సరదాగా అడిగేదాన్ని. ఇక వ్యాపారవేత్త తో పెళ్లి అంటూ వచ్చిన వార్తలు నాకు బాధ కలిగించాయి. అప్పటికే ఆయన 50 ఏళ్లకు పైగా వయసు ఉంటాడు.
ఆయన్ను అంతకు ముందు వరకు నేను ఒక్క సారి కూడా కలిసింది లేదు. ఆ తర్వాత కూడా ఆయన్ను కలవలేదు. ఈమద్య కాలంలో ఆయన్ను కలిశాను. ఆ సమయంలో నా గురించి అలా పుకార్లు ఎందుకు వచ్చాయి అంటూ ప్రశ్నించాను. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఆయన్ను అలా ఎందుకు అడిగారు అంటూ నన్ను కాస్త హెచ్చరించినట్లుగా మాట్లాడాడు అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది. మొత్తానికి తాను హీరోయిన్ గా ఉన్న సమయంలో తనపై వచ్చిన పుకార్ల పై చాలా సరదాగా స్పందించింది.