నయనతార సరోగసీ అంశంలో మీడియాను హెచ్చరించిన కస్తూరి ఉన్నట్టుండి ఇలానే ఎందుకు చేసింది? అంటూ ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ఆరాలు మొదలయ్యాయి. పెళ్లయిన మూడు నెలలకే నయనతార తల్లి కావడం సరోగసీపై ఊహాగానాలకు దారితీసింది. కానీ ఇదే సందర్భంలో సీనియర్ నటి కస్తూరి ఇలాంటి కామెంట్లు చేయడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. ఆ సందర్భం అలాంటిది.
నయన్ -విఘ్నేష్ జంట సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చారని చాలామంది నమ్ముతున్నారు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే నటి కస్తూరి శంకర్ భారతదేశంలో సరోగసీని నిషేధించారని ట్వీట్ చేశారు. మునుముందు దీని గురించి చాలా వినే అవకాశం ఉందని సదరు నటి పేర్కొన్నారు. నయనతార పేరును ఆమె ప్రస్తావించకపోయినా కానీ..ఆమె అద్దె గర్భం గురించే స్పందించినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి. ఇలా నయనతార విషయంలోనే తాను వ్యాఖ్యానించింది అంటూ ట్రోలింగుకి గురైంది.
అయితే తాను అందించింది సమాచారం మాత్రమేనని అందరూ తెలుసుకునేందుకేనని తెలిపిన కస్తూరి .. తన పోస్ట్ ను నయనతార సరోగసీకి లింక్ చేయవద్దని మీడియాను హెచ్చరించింది. తప్పుడు కథనాలు ప్రసారం చేసిందంటూ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ని కూడా ట్యాగ్ చేసింది. తన మాటలను వక్రీకరిస్తే మీడియాలపై తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించింది.
భారతదేశంలో సరోగసీ గురించి నా పోస్ట్ కు కొత్త తల్లిదండ్రులు నయనతార -విఘ్నేష్ శివన్ లను లింక్ చేస్తూ ఏదైనా మీడియా దురుద్దేశపూర్వకంగా కథనాలను ప్రచురించినట్లయితే పరువునష్టం దావా వేస్తాను. మీరు కూడా దీనిని హెచ్చరించండి అని మీడియాకు సూచించింది.
కస్తూరి ఇటీవల తెలుగు టీవీ సీరియళ్లలోను కనిపిస్తోంది. గృహలక్ష్మి అనే టీవీ సీరియల్ లో కస్తూరి కీలక పాత్రను పోషిస్తోంది. కస్తూరి ట్విట్టర్ లో యాక్టివ్ యూజర్. సమకాలీన సామాజికాంశాలతోపాటు రాజకీయాంశాల గురించి ప్రస్తావిస్తుంటారు. ఇటీవలే రాజమౌళి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది. అదే సమయంలో కస్తూరి ఒక నోట్ కూడా రాసింది. ``నా టీనేజ్ కుమార్తె జీవితంలో కలవాలనుకునే వ్యక్తుల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఒకరు.
మీరు ఆమె కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రయాణాలు అమెరికా దక్షిణాన్ని తాకుతున్నాయా? అని నేను ఆశ్చర్యపోతున్నాను?`` అని అన్నారు. బాలీవుడ్ ని `పాన్ ఇండియా`తో భర్తీ చేసిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు..... ఆస్కార్ వరకు!!! అంటూ విషెస్ ని కూడా అందించింది. అమెరికాలో నివశిస్తున్న కస్తూరి టీనేజీ కుమార్తె ఆకాంక్ష మేరకు త్వరలోనే రాజమౌళిని కలిసేందుకు ఛాన్సుందేమో చూడాలి. ఇక నయనతార కవలలకు జన్మనిచ్చారని తెలియగానే కస్తూరి సరోగసి గురించి ప్రస్థావించడం కేవలం సోషల్ మీడియా సెన్సేషన్ కోసమేనని భావించేవారు లేకపోలేదు. తన అపారజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు ఇది సరైన సమయం కాదని కొందరు నెటిజనులు వాదిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.