కథానాయికగా ఒక అవకాశాన్ని సంపాదించుకోవడం .. తొలి సినిమాతోనే అందానికీ .. అభినయానికి మంచి మార్కులు తెచ్చుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. చిత్రపరిశ్రమలో కథానాయికగా తమ అదృష్టం పరీక్షించుకోవడానికీ, అనునిత్యం ఎంతోమంది వస్తుంటారు. ఎవరిస్థాయిలో వాళ్లు తమ ప్రయత్నాలు చేస్తుంటారు.
అంతమందిలో తమకంటూ ఒక అవకాశం .. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టమైన విషయం. ఒకసారి ఇక్కడ అడుగుపెట్టిన తరువాత పరిగెడుతూనే ఉండాలి. అలుపుతీర్చుకోవడానికి ఆగితే, గమ్యాన్ని అందుకోలేనంత వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. అందుకే కథానాయికలు షూటింగు గ్యాపులో తప్ప ఖాళీగా కనిపించరు.
ఒకసారి కథానాయికగా పరిచయమైన తరువాత నిలబడిపోకుండా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అలాంటివారిలో నివేదా పేతురాజ్ .. ప్రియాంక జవాల్కర్ ముందువరుసలో కనిపిస్తారు. నివేద పేతురాజ్ మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం.
తెరపై నిండుగా కనిపిస్తూ కుర్రాళ్ల కళ్లకు పండుగ చేస్తూ ఉంటుంది. మోడ్రన్ డ్రెస్ లలో కుర్రాళ్లకు ఎంత మత్తుగా అనిపిస్తుందో .. చీరకట్టులోనూ అంతగానే చిత్తు చేస్తుంది. అందం ... అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇంకా ఆశించినస్థానాన్ని అందుకోనేలేదు. పడవలసిన పాత్రలు పడకపోవడమే అందుకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి.
ప్రస్తుతం ఆమె చేతిలో 'విరాటపర్వం' .. 'పాగల్' సినిమాలు ఉన్నాయి. 'విరాటపర్వం' సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తున్న ఆమె, 'పాగల్ సినిమాలో మాత్రం కథానాయికగానే అలరించనుంది. విష్వక్ సేన్ తో కలిసి అందాల విందు చేయనుంది. ఈ రెండు సినిమాల విడుదల కోసమే ఆమె కూడా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఈ సినిమాలు తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతాయనే బలమైన నమ్మకంతోనే ఆమె ఉంది.
ముఖ్యంగా 'పాగల్'తో తాను వేసిన గ్లామర్ గాలానికి చాలా సినిమాలు చిక్కుతాయనే ఆశతో ఉంది. ఇక ప్రియాంక జవాల్కర్ కూడా ఇలాగే తన సినిమాలను గురించి ఎదురుచూస్తోంది.
ప్రియాంక జవాల్కర్ ను చూస్తే కలువపూవుకు కళ్లు తగిలించినట్టుగా ఉంటుంది. చక్కని మేనిఛాయతో మనసున్న కుర్రాళ్ల మతులు పోగొడుతుంటుంది. 'టాక్సీవాలా'లో విజయ్ దేవరకొండ జోడీగా అలరించిన ఈ సుందరి, ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతుందని అనుకుంటే, అలా జరగలేదు.
అమ్మడికి అందం ఉన్నంత స్థాయిలో లౌక్యం లేదేమో కాస్త స్పీడ్ తక్కువగానే ఆమె కెరియర్ సాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఎస్ ఆర్ కల్యాణ మంటపం' .. 'గమనం' .. 'తిమ్మరుసు' సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు వైవిధ్యభరితమైన జోనర్లలో రూపొందినవే .. విడుదలకు ముస్తాబవుతున్నవే.
సత్యదేవ్ హీరోగా చేసిన 'తిమ్మరుసు' సినిమాలో ప్రియాంక మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. లాక్ డౌన్ తరువాత థియేటర్లలోకి ధైర్యంగా దిగుతున్న సినిమా ఇది. ఇక కిరణ్ అబ్బవరం సరసన ఆమె 'ఎస్ ఆర్ కల్యాణ మంటపం' సినిమాను చేసింది.
ఈ సినిమాను ఆగస్టు 6వ తేదీన విడుదల చేయనున్నారు. 'గమనం' కూడా ఓటీటీకి వెళుతుందా? థియేటర్లకు వస్తుందా? అనే విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ సినిమాల్లో మంచి హిట్టు ఒక్కటి పడినా, ప్రియాంక కెరియర్ పుంజుకునే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి మరి.