అతడు వేధించాడని అంటే ఎస్సీలను కించపరిచానని కేసు పెట్టారు.. నటి ఆవేదన!
తమిళ నటి శ్రీమతి మీరా మిథున్ ఇటీవల ఒక వీడియోలో ఎస్సీ కమ్యూనిటీ గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఓ వీడియోలో షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ) కమ్యూనిటీపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి మోడల్ కం నటి మీరా మిథున్ ను సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు విచారణకు పిలిచారు.
ఇటీవల సదరు నటి ఒక యూట్యూబ్ ఛానెల్ టాక్ షోలో పాల్గొన్నారు. సంఘం తప్పుడు పనులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆమె కూడా సినిమా పరిశ్రమలో తప్పులకు SC సంఘానికి చెందిన దర్శకులు ఇతరులను నిందించారు. అంటరానితనం నిర్మూలన ఫ్రంట్ మరియు విదుతలై చిరుతైగల్ కట్చి నుండి వచ్చిన ఫిర్యాదుల తరువాత సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు ఆమెను భారతీయ శిక్షాస్మృతి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగ (అరాచకాల నిరోధం) చట్టంలోని ఏడు నిబంధనల కింద కేసులు నమోదు చేశారు. కేసును విచారణకు స్వీకరించిన పోలీసులు గురువారం హాజరు కావాలని ఆమెకు సమన్లు జారీ చేశారు.
అయితే ఈ కేసులన్నీ తప్పుడువని మీరా ప్రత్యారోపణలు చేశారు. సంఘంలోని ఒక వ్యక్తి నన్ను వేధించాడని అంటే ఎస్సీ కేసులు నమోదు చేసారని ఆవేదన చెందారు. తమిళ చిత్ర పరిశ్రమలో పొరుగు భాషా తారలు రాణిస్తున్నారని తాను రాణించాలంటే కొందరు మగాళ్లకు లొంగి ఉండాలని కూడా తన ఆవేదనను వెల్లగక్కారు. ప్రస్తుతం పోలీస్ విచారణ సాగుతోంది. ఇందులో నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంటుంది. తనను కాపాడాలంటూ మీరా ప్రధాని మోదీకి.. సీఎం స్టాలిన్ కి మొర పెట్టుకోవడం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.