అందాల నమిత లైమ్ లైట్ లోకి రావాలని చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవలి కాలంలో బొద్దుతనం కాస్త తగ్గించుకుని తిరిగి సినిమాల్లో ప్రయత్నాలు ప్రారంభించాలని చూస్తోంది. కాస్త డైట్ మెయింటెయిన్ చేస్తూ స్లిమ్మవ్వాలని ఎటెంప్ట్ చేస్తోంది. అద్దం కనిపించినా, నీళ్లు కనిపించినా అందులో తను ఎంత లావు తగ్గిందో చూసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ బొద్దుతనం తగ్గడం అంటే మాటలా? లడ్డూ కావాలా నాయనా? అన్నట్టు లడ్డూలానే కనిపిస్తోందింకా.
సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే అంటూ బాలయ్యబాబును కవ్వించిన అందం ఇది. బిల్లా ప్రభాస్ నే స్విమ్మింగ్ డ్రెస్ తో కవ్వించిన నమితందం ఇది. అంత వేగంగా తగ్గిపోతే ఇంకెలా? అందుకే ఎంత డైట్ మెయింటెయిన్ చేసినా ఇసుమంత కూడా ఫలితం లేదాయే.. అయినా ఈ బొద్దందం తోనే తమిళ తంబీల చేత గుడి కట్టించుకుంది. ఇప్పటికీ అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నారక్కడ. అలాంటప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం వెంపర్లాడడం ఎందుకు? అక్కడే పెద్ద స్థాయిలో ట్రై చేస్తే పోలా?
ఈరోజు హైదరాబాద్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన నమితను చూసి ఇక్కడి జనాలు షాక్ తినేశారు. అసలు అమ్మడు సన్నబడ్డాను అంటోంది.. ఏమంత తగ్గిందని దేవుడా... అంటూ మనోళ్ళు నమితను యథావిథిగా తమిళ సాంబార్ తో బొద్దెక్కిన గుజరాతీ అందం గానే చూసి పక్కనెట్టేశారు మరి.