పెళ్లనేది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక. మన భారతీయ సంస్కృతిలో ఓ భాగం కూడా. ఇక్కడ పెళ్లీ పండగే.. ఆ తరువాత వచ్చే చావు పండగే.. ఇలాంటి సంస్కృతిని హైంధవ ధర్మాన్ని.. సనాతన ధర్మాన్ని నరనరాన జీర్ణించుకున్నఇండియా అన్నా.. ఇండియన్ సంస్కృతి అన్నా ప్రపంచ దేశాలన్నీ తలవంచి నమస్కరిస్తాయి. భారతీయ స్త్రీకి ప్రపంచ దేశాలు ఇచ్చే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆలాంటి పెళ్లి వ్యవస్థపై సీనియర్ నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట సంచలంగా మారాయి.
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వాడాకులు తీసుకున్న ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై, పెళ్లి వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు వివాదంగా మారాయి. జీవితం అసంపూర్తిగా వుంటే పెళ్లి అనేది వేస్ట్ అన్నారు. ఇంతకు ముందు ఫ్యామిలీ కోర్టు ఇంతకు ముందు నాకు తెలిసి ఒకే ఒక్కటి వుండేది కానీ ఇప్పడు ఆరో ఏడో అయ్యాయి. పదిలో ఏడుగురు లేదా నలుగురు పెళ్లైన నెలలకే డైవర్స్ తీసుకుంటున్నారు. ఒక్కరిద్దరు మాత్రమే రాజీపడి కలిసి వుంటున్నారు.
మ్యారేజ్ లు సక్సెస్ కావడం లేదు. ఎందుకు సక్సెస్ కావడం లేదు. అప్పట్లో ఇద్దరిలో ఒకరు భర్త సంపాదించుకొచ్చేవాడు.. భార్య ఇంటికి యజమాని.. ఆమె పిల్లల పెంపకంతో పాటు ఇంట్లో వున్న పెద్దవాళ్ళని చూసుకునేది. అంతా కలిసి ఓ కుటుంబం వుండేది. ఇప్పడు ఎకనామికల్ బ్యాలెన్స్ మొదలైంది. ఎవరికి వారికి వ్యక్తిగత సెల్ ఫోన్ లు ఫ్రెండ్స్..వ్యక్తిగత జీవితాలు వున్నాయి. కాబట్టి పోను పోను మ్యారేజ్ వ్యవస్థ అనేది ఉండదు. అది ఫెయిల్ అవుతుంది. పెళ్లికి మీనింగ్ కూడా లేకుండా పోతుంది.
మ్యారేజ్ ని ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అదో ఈవెంట్ లా చేయడం.. నెలరోజుల్లో డైవర్స్ తీసుకోవడం.. పెళ్లిపై నా హోప్ వదులుకున్నాను. ఫిల్మ్ పీపుల్సే కాకుండా బయట కూడా డైవర్స్ పెరిగిపోయాయి. కళాకారుడనేవాడిది చాలా సున్నితమైన మనస్థత్వం.. సాధారణ వ్యక్తితో పోలిస్తే ఆర్టిస్ట్ లైఫ్ చాలా ప్రత్యేకమైనది.
అందుకే సినిమా కోసం ఏం వదులుకోవడానికైనా నేను సిద్ధం. సినిమానే నా లైఫ్, వైఫ్..నా పాషన్.. నా మనస్థత్వానికి, నా చుట్టూ వుండే వాతావరణానికి అలవాటు పడి నాతో ట్రావెల్ అవుతారో వాళ్లే నాతో వస్తారు.. అలా అడ్జెస్ట్ కాలేని వాళ్లు మాత్రమే వదిలి వెళ్లిపోతారు` అని నరేష్ చెప్పారు.
అయితే నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ సినిమా వాళ్లే విడిపోతున్నారా? .. పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? .. మిగతా వాళ్లు విడిపోవడం లేదా? అని ఎదురు ప్రశ్నించారు నరేష్. గత కొన్ని రోజులుగా నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ ని వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన రహస్యంగా వివాహం చేసుకున్నారని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివాహ వ్యవస్థపై సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.