పాపం నిధి.. ఎంత కష్టమెచ్చింది..!

Update: 2023-06-28 08:00 GMT
అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడు నోట్లో శని ఉన్నట్లు అనే సామేత ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు. మన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ని చూస్తుంటే అదే గుర్తుకు వస్తుంది. చాలా మంది హీరోయిన్లకు మంచి మంచి ఛాన్సులు రావు. ముఖ్యంగా స్టార్ హీరోల ఛాన్స్ అంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. కానీ, నిధికి ఆఫర్లు పెద్ద కష్టపడకుండానే వచ్చినా, అది ముందుకు సాగడానికి మాత్రం శని అడ్డు వచ్చాడు.

నిధి అగర్వాల్ సవ్యా సాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా క్లిక్ అవ్వకపోయినా, ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. వెంటనే రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ లో ఛాన్స్ వచ్చింది.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీలో నిధి అందాలతో పాటు, నటకు అందరూ ఫిదా అయిపోయారు. వెంటనే ఆమె రెండు భారీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు వచ్చాయి. ఇంకేముంది, నిధి స్టార్ హీరోయిన్ అయిపోనట్లే, ఆమె కెరీర్ కి తిరుగులేదు అనుకున్నారు. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది.

నిధి నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరహర వీర మల్లు సినిమాలో నటించాల్సి ఉంది. ఈ మూవీని 2020లో ప్రకటించారు. కొన్ని రోజులు ఈ బ్యూటీ షూటింగ్ కి కూడా వెళ్లింది. ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

అయితే, కారణం తెలీదు కానీ, ఈ మూవీ మొదట్లోనే వాయిదా పడింది. మళ్లీ ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో కూడా ఎవరికీ తెలియడం లేదు. అసలు మూవీ ఉంటుందా లేదా అని కూడా తెలీదు.

పవన్ పక్కన నటిస్తే, తన కెరీర్ మారిపోతుందని ఆశపడింది. కానీ అది జరగలేదు. సరే పవన్ మూవీ ప్రారంభం కాకపోతే ఏంటి? ప్రభాస్ మూవీ ఉంది కదా అనుకుంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో హర్రర్ కామెడీ మూవీ ఒకటి తెరకెక్కాల్సి ఉంది. ఈ మూవీలోనూ నిధినే హీరోయిన్ గా అనుకున్నారు.

కానీ, ఇది కూడా ఇప్పుడప్పట్లో ప్రారంభమయ్యేలా కనపడట్లేదు. ప్రభాస్ చేతిలో భారీ జాబితా ఉంది. సలార్ షూటింగ్ జరుగుతోంది. దాని తర్వాత ప్రాజెక్ట్ కే ఉంది. అది అయిపోయాక ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

దానికి ఎంత కాలం పట్టొచ్చో ఎవరూ చెప్పలేరు. ఆలోపు హీరోయిన్ ని మార్చినా ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు.పాపం, నిధి కి వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదు. మరి ఇవి పక్కన పెట్టి, వేరే సినిమాల్లో అయినా ఆమెకు ఆఫర్లు వస్తాయో చూడాలి.

Similar News