పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని: సాయి పల్లవి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయి పల్లవి.
మిగతా హీరోయిన్లలా సాయి పల్లవి గ్లామరస్ హీరోయిన్ కాదు. పెద్ద అందగత్తె కూడా కాదు. స్క్రీన్ పై గ్లామర్ షో చేయదు. అయినా తన నేచురల్ పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే ఆమె అందరినీ ఫిదా చేసేసింది.
ఫిదా తర్వాత నుంచి ఇప్పటివరకు సాయి పల్లవి ప్రతీ సినిమాతోనూ తనదైన ముద్ర వేసుకుంటూ నటిగా చాలా ఉన్నత స్థాయికి ఎదిగింది. నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రీసెంట్ గా వచ్చిన తండేల్ సినిమా పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
అందరి హీరోయిన్ల లాగా పెద్ద స్టార్ తో ఛాన్స్ వచ్చిందంటే వెంటనే సినిమాను ఒప్పుకునే టైప్ కాదు సాయి పల్లవి. కథలో తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది? ఆ సినిమా చేశాక ఆడియన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇలా ఎన్నో ఆలోచించాకే సాయి పల్లవి ఒక సినిమాను ఓకే చేస్తుంది. తండేల్ సినిమాలో తన నటనను చూసి ఆడియన్స్ పల్లవిని ఎంతో మెచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉంటే రీసెంట్ గా తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి టాలీవుడ్ లో తనకు ఇష్టమైన నటుడెవరో తెలిపింది. అతను మరెవరో కాదు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన పెద్ద సూపర్ స్టార్ అయి కూడా ఎంతో సింపుల్ గా ఉంటూ హుందాగా మాట్లాడటంతో పాటూ నలుగురికి సాయం చేస్తారని, అందుకే పవర్ స్టార్ కు తాను పెద్ద అభిమానినని సాయి పల్లవి వెల్లడించింది.
ప్రస్తుతం తండేల్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి తర్వాత తెలుగులో ఏ సినిమా చేయనుందనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ లో మాత్రం సాయి పల్లవి రణ్‌బీర్ కపూర్ తో కలిసి నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం చేస్తుంది. అయితే సాయి పల్లవిని టాలీవుడ్ లో తన ఫ్యాన్స్ అంతా ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే.