త్రిష ఎక్స్ ఖాతాలో అవి చూసి అందరూ షాక్‌లో
సోషియో ఫాంటసీ నేపథ్యంలోని ఈ సినిమాలో త్రిష పాత్రకు ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.
త్రిషను ఒక తెలుగు సినిమాలో చూసి చాలా రోజులైంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' అనే చిత్రంలో నటిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలోని ఈ సినిమాలో త్రిష పాత్రకు ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. మల్లిడి వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మరోవైపు తమిళంలో తళా అజిత్ సరసన త్రిష నటించింది. విదాముయార్చి ఇటీవలే విడుదలై తమిళంలో అద్భుత వసూళ్లను సాధిస్తోంది. ఈ విజయాన్ని ఆస్వాధిస్తుండగానే, త్రిష తన ఎక్స్ ఖాతాలో క్రిప్టో కరెన్సీ గురించి చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి.
అయితే ఎక్కడో తప్పు జరిగిందని గ్రహించిన త్రిష వెంటనే తన ఎక్స్ ఖాతాను చెక్ చేసి, అది హ్యాక్ అయ్యిందని గ్రహించింది. దానిని వెంటనే ఇన్ స్టాగ్రమ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. త్రిష సోషల్ మీడియాలు హ్యాక్ కావడం ఇప్పుడే మొదటి సారి కాదు. `పెటా` కార్యకర్తగా ఉన్న త్రిషకు సంబంధించిన సామాజిక మాధ్యమాలను నేరగాళ్లు కాపు కాసి మరీ హ్యాక్ చేసారు. ఇప్పుడు ఎక్స్ ఖాతా మరోసారి హ్యాక్ అవ్వడంతో ఆ సమాచారాన్ని వెంటనే తనవారికి చేరవేసింది. తాను క్రిప్టో గురించి ఎలాంటి పోస్టులు చేయలేదని కూడా వెల్లడించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష ఇలా రాసింది.. నా ట్విట్టర్ హ్యాక్ అయింది గైస్. సరిదిద్దే వరకు నా నుండి పోస్ట్ లు ఏవీ రావు.. ధన్యవాదాలు! అని జోడించారు. సెలబ్రిటీల సామాజిక మాధ్యమాలను హ్యాక్ చేసి, దాని ద్వారా తమకు తోచిన ప్రచారాలు చేసుకునేందుకు హ్యాకర్లు తెగబడుతున్నారు. ఇది సెలబ్స్ కి తీవ్ర ఇబ్బందికర పరిణామం.