2015 కొకైన్ కేసులో నిర్ధోషిగా బ‌య‌ట‌ప‌డ్డ‌ న‌టుడు!

షైన్ అలాగే నలుగురు మహిళా మోడ‌ల్స్ మార్చి 2015లో కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు రెండు నెలలు జైలులో గడిపారు.

Update: 2025-02-11 15:39 GMT

కొకైన్ సేవించార‌నే తీవ్ర‌ ఆరోపణలపై జనవరి 2015లో అరెస్టయిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, అత‌డితో పాటు ఉన్న నలుగురు మహిళా మోడల్స్‌ను ఎర్నాకుళంలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మంగళవారం (ఫిబ్రవరి 11న) నాడు నిర్దోషులుగా విడుదల చేసింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985 కింద అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తీర్పు ఇచ్చింది. కొకైన్ ఉప‌యోగించ‌లేద‌ని రక్త పరీక్ష ఫలితాల ద్వారా తేలింద‌ని, సంఘటన స్థలంలో దొరికిన మాదకద్రవ్యాలు నిందితుడివేనని ప్రాసిక్యూషన్ నిర్ధారించలేకపోయిందని తీర్పు చెప్పింది. షైన్ అలాగే నలుగురు మహిళా మోడ‌ల్స్ మార్చి 2015లో కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు రెండు నెలలు జైలులో గడిపారు.

కొచ్చిలోని కడవంత్రలోని ఒక అపార్ట్‌మెంట్‌లో న‌టుడిపైనా అత‌డి అనుయాయుల‌పైనా పోలీసులు జరిపిన దాడిలో ఈ కేసు పెట్టారు. అక్కడ ఆ బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. త్రిస్సూర్‌లో సెక్యూరిటీ గార్డును హమ్మర్‌ను ఢీకొట్టిన నిందితుడి గురించి సెర్చ్ చేస్తుండ‌గా, నిస్సామ్ యాజమాన్యంలోని మరో అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేసారు. అక్క‌డ‌ షైన్, మోడల్స్ రేష్మా, బ్లెస్సీ, టిన్సీ బాబు, స్నేహ బాబులను అరెస్టు చేశారు.

ఈ కేసులో ఇతర నిందితులు ఆఫ్రికన్ జాతీయుడు ఒకోవ్ చిగోజీ కాలిన్స్, పృథ్వీరాజ్, జస్బీర్ సింగ్. కానీ పృథ్వీరాజ్ తరువాత అప్రూవర్‌గా మారి కోర్టులో రేష్మాకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కేసులో ఇప్పుడు వారంతా నేరానికి పాల్ప‌డ‌లేద‌ని ప్రూవైంది.

Tags:    

Similar News