సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
ఐతే ఈ సినిమాను ప్రేమికుల రోజు నాడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
కోలీవుడ్ సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. గౌతం వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంలో వారణం ఆయిరం గా రిలీజైంది. 2008 నవంబర్ 14న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఐతే ఈ సినిమాను ప్రేమికుల రోజు నాడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
సూర్య సన్నాఫ్ కృష్ణన్ తెలుగు వర్షన్ ను సీ.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సూర్య డ్యూయల్ రోల్ చేసి అలరించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను పి.వి.ఆర్ థియేటర్ చైన్ లవర్స్ డే వీక్ కంటెస్ట్ లో భాగంగా ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నారు. 13వ తారీఖు కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది.
ఐతే ఫిబ్రవరి 14న సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అవుతుందని సీ.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ వెల్లడించింది. దాదాపు 300 షోస్ దాకా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. కర్ణాటకలో కూడా ఈ సినిమా తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ రీ రిలీజ్ టైం లో కూడా సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ చేయడం మా ప్రొడక్షన్ కు గొప్ప అనుభూతి అని.. సినిమాతో మరోసారి మాస్టర్ క్లాస్ సినిమా చూసే అవకాశం ఉందని అన్నారు. సూర్య సన్నాఫ్ కృష్ణ సినిమాలో హారిస్ జైరాజ్ ఇచ్చిన మ్యూజిక్ ప్రత్యేకంగా సాంగ్స్ అయితే ఇప్పటికీ స్పెషల్ గా ఉంటాయి. వాలెంటైన్స్ డే నాడు ఈ సినిమా తెలుగులో రీ రిలీజ్ చేయడం సూర్య తెలుగు లవర్స్ కి సూపర్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.
స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా తెలిసిందే. ఐతే ప్రత్యేకంగా వాలెంటైన్స్ డే రోజు రిలీజ్ చేసే సినిమాలు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో ప్రేమ కథతో పాటు తండ్రి కొడుకుల కథ కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది.