హీరోయిన్‌ వినాయకుడి పూజా.. నవ్వు తెప్పిస్తున్న జాగ్రత్తలు

Update: 2020-08-22 17:30 GMT
సినీ సెలబ్రెటీలు అంతా కూడా వినాయకుడి పూజను భక్తి శ్రద్దతో ప్రతి ఏడాది ఎంతో వైభవంగా చేసుకుంటారు. తమ కోసం పని చేసే వారిని తమ కుటుంబ సభ్యులు బంధు మిత్రులందరిని కూడా ఆహ్వానించి వైభవంగా వేడుక నిర్వహిస్తారు. కాని ఈసారి అలాంటి వాతావరణం లేదు. అసలు వినాయకుడిని ప్రతిష్టించేందుకు కూడా పోలీసులు ఒప్పుకోవడం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లే వినాయకుడిని ప్రతిష్టించుకుని పూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో కూడా బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పశెట్టి వినాయకుడి పూజను భారీ ఎత్తున చేసింది.

ఈ వినాయక చవితి రోజున శిల్పశెట్టి తన కొడుక్కు అన్నప్రాసన చేయడంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని ఆమె భావించింది. అయితే కరోనా కారణంగా అయ్యవారిని ఇంటికి తీసుకు రావడం మంచిది కాదని ఆమె భావించింది. కాని అయ్యవారు లేకుండా వత్రం, వినాయకుడి పూజ అన్నప్రాసన ఎలా జరుగుతుంది అనుకుంది. అయ్యవారిని తీసుకు రావాల్సిందే కాని జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంది.

తమ ఇంటోల రెగ్యులర్‌ గా పూజలు చేసే అయ్యవారిని రెండు వారాల పాటూ పూర్తిగా స్వీయ నిర్బందంలో ఉండమని ఆ తర్వాత ఆయనకు కరోనా టెస్టు నిర్వహించిన తర్వాత మాత్రమే పూజకు అయ్యవారిని తీసుకు వచ్చిందట. ఇక ఈ పూజకు బంధు మిత్రులను ఎవరిని కూడా ఈమె ఆహ్వానించలేదట. మరీ ఇంత జాగ్రత్త ఏంటీ శిల్ప అంటున్నారు. ప్రస్తుత సమయంలో ఇలాంటి జాగ్రత్తు తప్పనిసరి అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News