'ప్రేమ ఎవరి మనసులోనైనా కలగొచ్చు.. ఎప్పుడైనా, ఎవరి మీదనైనా కలగొచ్చు' అంటున్నారు నటి ముగ్ధా గాడ్సే! పలు విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయని, మనసుకు నచ్చిన వారితో జీవితం పంచుకోవడం కంటే ఆనందం మరేదీ ఉండదని చెప్పారు ముగ్దా. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ముగ్దా.. 'ఫ్యాషన్'తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా.. గలీ గలీ చోర్ హై, విల్ యూ మ్యారీ మీ?, హీరోయిన్ వంటి సినిమాలతో మెరిసిందీ బ్యూటీ.
అయితే.. ఇవన్నీ సాధారణ విషయాలే అయినప్పటికీ.. ఆమె తనకన్నా 18ఏళ్లు పెద్దవాడైన రాహుల్ దేవ్ తో సహజీవనం చేస్తుండడమే విశేషం. రాహుల్ దేవ్ వయసు ప్రస్తుతం 52ఏళ్లు. కాగా.. వీరి లవ్ జర్నీకి ఎనిమిదేళ్లు నిండబోతున్నాయి. ఈ నేపథ్యంలో.. జూమ్ టీవీతో ముగ్ధ మాట్లాడారు. రాహుల్ దేవ్ తో తన బంధం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.
ఇక, వారిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి చెబుతూ.. 'భాగస్వామిని ఎంచుకోవడం అంటే షాపింగ్ చేయడం వంటిది కాదు కదా. నాకు ఈ కలర్ బ్యాగ్ నచ్చింది కాబట్టి కొనుక్కుంటున్నాను అన్నట్లుగా ఉండదు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికైనా ప్రత్యక్ష అనుభవంలోకి వస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. వయసుతో అసలు సంబంధం ఉండదు''అని చెప్పారు ముగ్ధా.
అయితే.. ప్రతి నాయకుడి పాత్రలో అన్ని ఇండస్ట్రీల్లోనూ మెప్పించిన రాహుల్ దేవ్.. గతంలో రీనాను పెళ్లి చేసుకున్నారు. వీరికి సిద్ధాంత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. క్యాన్సర్ బారిన పడిన రీనా 2009లో మరణించడంతో రాహుల్ ఆవేదనలో మునిగిపోయాడు. ఆ తర్వాత ఓ పెళ్లిలో ముగ్ధాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. నెటిజన్లు వీరి బంధాన్ని ట్రోల్ చేశారు. అయితే.. అవి పట్టించుకోని ఈ జంట.. ప్రేమకు వయసుతో సంబంధం లేదని కౌంటర్ ఇచ్చింది.