ఎందుకనో నాకెప్పుడూ సీనియర్ల మీదే క్రష్ ఉండేది: మెగా మేనల్లుడు

Update: 2022-08-25 23:30 GMT
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా 'ఉప్పెన' సినిమాతో హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయ్యాడు సాయి తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రంతో బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వైష్ణవ్.. కథానాయకుడిగా తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది.

అయితే వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే 'కొండపొలం' అనే రూరల్ అడ్వెంచర్ ను పూర్తి చేశాడు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పరాజయం పాలైంది. దీంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రాక్ మార్చి ''రంగ రంగ వైభవంగా'' అనే రొమాంటిక్ లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

BVSN ప్రసాద్ నిర్మాణంలో గిరీశయ్యా దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ రంగ వైభవంగా' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వైష్ణవ్ తేజ్ - గిరీశయ్యా తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమంలో గెస్టులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగా..' సినిమా సంగతులతో పాటుగా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తున్నప్పుడు మేనమామ చిరంజీవి తో ఎదురైన అనుభవాలను.. 'ఉప్పెన' షూటింగ్ టైంలో ఇబ్బందులు పడిన విషయాలను వెల్లడించాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.

'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాలో బాలనటుడిగా నటిస్తున్నప్పుడు మేనమామ ఏమైనా సలహాలు ఇచ్చారా? అని అలీ ప్రశ్నించగా.. ''అందులో నా క్యారక్టర్ కళ్ళు కూడా ఆర్పకుండా కుర్చీలో స్టడీగా కూర్చొని కదలకుండా ఉండాలి. అయితే ఓ సీన్లో నేను బాగా నవ్వేశాను. అప్పుడు పెదమామయ్య సీరియస్ అయ్యారు'' అని వైష్ణవ్ తేజ్ తెలిపారు.

ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినప్పుడు తేజ్ అనిపిలిచినప్పుడు అందరూ వెనక్కి తిరుగుతారా? అని అడగ్గా.. చిరంజీవి గారు 'ఓరేయ్' అని అరిస్తే చాలు.. అందరం వెళతాం అని వైష్ణవ్ చెప్పారు. 'ఉప్పెన' కథను మొదట తనతో పాటుగా కొందరు స్నేహితులు విన్నామని.. ఏంటీ ఈ కథ అని కాస్త భయపడ్డానని తెలిపారు.

అయితే సుకుమార్ మరియు మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు 'ఉప్పెన' స్టోరీని తన మామయ్యని నెరేట్ చేశారని.. ఆయన వెంటనే.. ఐడియా బాగుంది. సినిమా చేసేయ్ అని అన్నారని తేజ్ వెల్లడించారు. ఆ సినిమాలో ‘జలజలపాతం నువ్వు’ అనే రొమాంటిక్ సాంగ్ చేయడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని.. అంతమంది ముందు రొమాన్స్ ఎలా చేయాలో అర్థం కాలేదని తెలిపాడు.

'ఉప్పెన' సినిమా షూటింగ్ లో తాను కన్నీళ్ళు పెట్టుకున్న క్షణాలను గుర్తు చేసుకున్నాడు వైష్ణవ్. "ఉప్పెన లో ఓ సీన్లో 'నీతో మాట చెప్పాలి బేబమ్మా' అని నేను కాస్త ఎమోషనల్ గా చెప్పాలి. ఎందుకో అది నాకు రావట్లేదు. 20 టేక్స్ పైనే అయ్యాయి కానీ నాకు ఎమోషన్ రావడం లేదు. నా కోసం కృతి శెట్టి తో పాటుగా టీమ్ అంతా వెయిట్ చూస్తున్నారు. అందరి సమయాన్ని వృథా చేస్తున్నా అనిపించింది. ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది'' అని చెప్పుకొచ్చాడు.

ఎందుకనో తనకు చిన్నప్పటి నుంచీ సీనియర్ల మీదే క్రష్ ఉండేదని వైష్ణవ్ తేజ్ తెలిపారు. 'తమ్ముడు' 'బద్రి' చిత్రాలను దాదాపు 120 - 125 సార్లు చూసినట్లు చెప్పాడు. 'ఉప్పెన' లో చేపలు పడితే.. 'కొండపొలం' లో మేకలు పట్టానని 'రంగ రంగ వైభవంగా' సినిమా అమ్మాయిలని పట్టానని సరదాగా అన్నారు.
Tags:    

Similar News