ఔను మా పెళ్లి అయిపోయింది

Update: 2022-10-23 16:36 GMT
'అవును' సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ పూర్ణ. హీరోయిన్ గా ఈమెకు సరైన బ్రేక్ దక్కకున్నా కూడా బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించి మెప్పించిన విషయం తెల్సిందే. ఇప్పటికి కూడా ఈమె వచ్చిన సినిమా ఆఫర్స్ ను సద్వినియోగం చేసుకుంటూ బుల్లి తెర ద్వారా ఎంటర్‌ టైన్మెంట్ ను అందిస్తోంది.

అందివచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను ఈ అమ్మడు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తోంది.. అంతే కాకుండా ఈమె బుల్లి తెరపై రియాల్టీ షో లకు జడ్జ్‌ గా వ్యవహరిస్తుంది. మరో వైపు ఎంటర్ టైన్మెంట్‌ అందించే వెబ్ సిరీస్‌ ల్లో కూడా నటిస్తోంది.

ఇంతటి ఎంటర్ టైన్‌మెంట్‌ ను అందిస్తున్న ముద్దుగుమ్మ పూర్ణ పెళ్లి గురించి ఆ మధ్య తెగ వార్తలు వచ్చాయి. అరబ్‌ దేశానికి చెందిన ఆసీఫ్ అలీ తో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇద్దరి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇద్దరి వివాహ నిశ్చితార్థం జరిగిందని.. ఇద్దరి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి.

పెళ్ల వార్తలపై ఎట్టకేలకు హీరోయిన్‌ పూర్ణ స్పందించారు. ఔను మేము పెళ్లి చేసుకున్నాం. మే 31వ తారీఖున మా యొక్క వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. జూన్‌ 12వ తారీకున మా వివాహం జరిగిందని పేర్కొంది. అయితే పెళ్లి గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకుండా ఇప్పుడు ప్రకటించడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

పెళ్లి అయ్యి ఇన్ని నెలలు అయిన తర్వాత ఆమె పెళ్లి గురించి స్పందించింది. అంతే కాకుండా అతి త్వరలోనే కేరళలో భారీ ఎత్తున ఒక రిసెప్షన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా ఆమె ప్రకటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు బుల్లి తెరకు దూరం అవ్వాలని తాను భావించడం లేదని క్లారిటీ ఇచ్చింది.
Tags:    

Similar News