సీక్రెట్ గా పూర్ణ పెళ్లి...నెట్టింట పెళ్లి ఫోటోలు

Update: 2022-10-25 06:45 GMT
న‌టి పూర్ణ వివాహం వ్యాపార వేత్త షానిద్ ఆసీఫ్ అలీతో జ‌రిగిన‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వివాహం చాలా సింప‌సుల్ గా దుబాయ్ లో జ‌రిగిపోయింది. మే 31 నిశ్చితార్ధం నిర్వ‌హించ‌గా..అటుపై   పెళ్లికి ఎక్కువ స‌మ‌యం తీసుకోకుండానే జూన్ 12న అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో నిరాడంబ‌రంగా పెళ్లి తంతు ముగిం చిన‌ట్లు పూర్ణ  రివీల్ చేసింది.

అయితే విష‌య‌మే చెప్పింది గానీ.. పెళ్లి తంతు తాలుకా ఫోటోలు ఎక్క‌డా లీక్ కాకుండా జాగ్ర‌త్త ప‌డింది. క‌నీసం పెళ్లి కూతురు ఫోటోగానీ..పెళ్లి కొడుకు ఫోటోగానీ  లీక్ అవ్వ‌లేదు. దీంతో ఇంత ర‌హ‌స్యం దేనికి? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటి జ‌నులు సందేహం వ్య‌క్తం చేసారు. పెళ్లి విష‌యం దాచేయాల్సినంత అవ‌స‌రం ఏముంది?  చెప్పుకుంటే న‌లుగురు నాలుగు దీవెన‌ల‌తో ఆశీర్వ‌దించే ఘ‌ట్ట‌మే క‌దా?  దేనికింత ర‌హ‌స్యం అని గుస‌గుస‌లు వినిపించాయి.

తాజాగా వాట‌న్నింటికి పూర్ణ పుల్ స్టాప్ పెట్టింది. కొద్ది సేప‌టి క్రిత‌మే పెళ్లి  కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూర్ణ పెళ్లి కుమార్తెగా ముస్తాబైన ఫోటోలు...సంప్ర‌దాయంగా జ‌రుగుతోన్న పెళ్లి తంతు ఫోటోలిప్ప‌డు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దీంతో అభిమాన‌లు న‌వ దంప‌తుల‌కు విషెస్  తెలియ‌జేస్తున్నారు. చీరకట్టులో పూర్ణ ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తోంది. ఆ అరుదైన క్ష‌ణాల్ని గుర్తు చేసుకుంటూ పూర్ణి ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసింది.

`నేను ఈ ప్రపంచంలో అత్యంత అందమైన మహిళను కాకపోవచ్చు.  భార్యకు ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ నాకు లేకపోవచ్చు. కానీ నేను ఎవ్వరికీ తక్కువ కాదని నేను ఫీలయ్యేలా నువ్వు చేశావు. నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం లేకుండా నేను నేనుగా ఉండేలా నువ్వు చూసుకున్నావు. అందుకే నేను నా పనిని స్వేచ్ఛగా చేసుకుంటూ నా అత్యుత్తమ ప్రతిభను బయటపెట్టుకోగలుగుతున్నాను. ఈ రోజు మన బంధువులు.. సన్నిహితుల సమక్షంలో నీతో అద్భుత ప్రయాణాన్ని మొదలుపెడుతున్నా. ఎలాంటి సమయంలో అయినా నేను నీతో తోడు ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా` అంటూ పూర్ణ పోస్ట్ లో పేర్కొంది.

టాలీవుడ్ లో  పూర్ణ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ రకంగా బిజీ కాలేదు. కొన్ని సినిమాల్లో న‌టించిన అనంత‌రం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ట‌ర్న్ తీసుకుంది. అలాగే టీవీ షోల‌కు హోస్ట్ గాను మారింది.  ఆ ర‌కంగా పూర్ణ సెకెండ్ ఇన్నింగ్స్ బుల్లితెర‌...వెండి తెర‌పై కొన‌సాగుతుంది. మ‌రి వివాహ‌మైన నేప‌థ్యం లో ఒక‌పై వృత్తిగ‌త జీవితానికి పుల్ స్టాప్ పెడుతుందా?  కొన‌సాగిస్తుందా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News