ఫోటో స్టొరీ: బోటుపై పోజిచ్చిన బికినీ భామ

Update: 2019-04-26 08:16 GMT
హీరోయిన్లు చాలామందే ఉంటారు కానీ వారిలో రాధిక ఆప్టే రూటే సెపరేటు.  మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే కాదు.. అవసరమైతే నగ్నంగా నటించేందుకు కూడా సందేహించదు.  ఇక  లైంగిక వేధింపుల గురించి.. సౌత్ లో హీరోయిన్లను గ్లామర్ డాల్స్ గా చూపించడం గురించి ఓపెన్ గా మాట్లాడగల ధైర్యం ఆమె సొంతం. ఈ భామ ముంబైకి వెళ్ళిన తర్వాత టాలీవుడ్ పై విమర్శలు చేయడం చాలామంది తెలుగువారికి నచ్చలేదు కానీ అలాంటివి ఈ భామ అసలు పట్టించుకోదు. ప్రస్తుతానికైతే ఈ భామ బాలీవుడ్లో బిజీగా ఉంది. మధ్యలో అప్పుడప్పుడూ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా హీట్ పెంచే ప్రయత్నాలు కూడా చేస్తుంటుంది.

తాజాగా రాధిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలో ఒక బోటుపై చిల్ అవుట్ అవుతోంది రాధిక.  అడ్డంగా చారలు ఉండే ఒక బికినీని ధరించి బోటుపైన ఉండే స్టెయిన్ లెస్ స్టీల్ రెయిలింగ్ పై కూర్చుంది. ఆ ఫోటోకు "ఈ పడవలో కూర్చునేందుకు మొత్తానికి ఒక ప్రదేశాన్ని వెతుకున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఇక కూర్చున్న పొజిషన్ కాస్త ఒంగినట్టుగా ఉండడంతో తన ఫ్లాట్ స్టమక్.. సిక్స్ ప్యాక్ షేప్ కూడా తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే జుత్తును సరిచేసుకుంటూ నవ్విన నవ్వు మాత్రం అదిరిపోయింది. ఒక్కరోజులోపలే నెటిజనులు మూడున్నర లక్షల లైకులు కొట్టడమే కాకుండా ఎన్నో ఇంట్రస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఒకరు మిలియన్ డాలర్ స్మైల్ అన్నారు. మరొకరు సెక్సీ బ్యూటీ ఆన్ ది బోట్ అన్నారు.  ఒక అభిమాని మరీ రెచ్చిపోయి ఈస్ట్ ఆర్ వెస్ట్ రాధిక ఈజ్ ది బెస్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.   అందరూ పొగడరు కదా.. కొందరు తిట్టడం కూడా జరిగింది!

ఇక రాధిక నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా ఆమె నటించిన 'అంధాధున్' చైనాలో రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టింది.  మరోవైపు రాధిక 'ది ఆశ్రమ్'..'ది వెడ్డింగ్  గెస్ట్' అనే ఇంగ్లీష్ సినిమాలలో నటిస్తోంది.
Tags:    

Similar News