కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా ఇతరత్ర కారణాల వల్ల ఎక్కువగా మీడియాలో అటెన్షన్ పొందుతూ వచ్చింది. తెలుగులో ఈమె నాని హీరోగా నటించిన జెండాపై కపిరాజు అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో ఈమెకు రెండవ ఛాన్స్ రాలేదు. మరో వైపు కన్నడంలో ఈ అమ్మడు అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు తాజాగా రవి అనే ఒక వ్యక్తితో కలిసి బెంగళూరులోని బనశంకరి రిట్జ్ కార్టన్ హోటల్ కు వెళ్లింది.
రాగిణి ద్వివేది మరియు రవి ఆ హోటల్ కు వెళ్లక ముందే అక్కడ శివ ప్రసాద్ తన స్నేహితులతో కలిపి పార్టీ చేసుకుంటున్నాడు. పార్టీలో భాగంగా శివ ప్రసాద్ కాస్త ఎక్కువగానే తాగాడు. రాగిణి ద్వివేది మాజీ లవర్ ఈ శివ ప్రసాద్. తన మాజీ ప్రేయసి రాగిణి ద్వివేదిని మరో వ్యక్తితో చూసిన శివ ప్రసాద్ కు కోపం కట్టలు తెంచుకుంది. దాంతో రవిపై బూతుల దండకం అందుకున్నాడట. దాంతో రవి కూడా శివ ప్రసాద్ పైకి వెళ్లాడు. ఇద్దరు కలిసి కొట్టుకునే వరకు వెళ్లింది.
తాగిన మత్తులో ఉన్న శివ ప్రసాద్ పక్కనే ఉన్న బీర్ బాటిల్ తో రవి తలపై బలంగా కొట్టాడు. దాంతో రవికి తీవ్ర గాయమైంది. వెంటనే తేరుకున్న హోటల్ సిబ్బంది మరియు ఇతరులు వెంటనే ఇద్దరిని విడిపించారు. రవి హాస్పిటల్ లో ప్రాధమిక చికిత్స తీసుకుని అక్కడ నుండి పోలీసు స్టేషన్ కు రాగిణి ద్వివేదితో వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. రవి ఫిర్యాదుతో శివ ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవికి అంతకు ముందే పెళ్లి అయ్యింది. పెళ్లి అయినా కూడా గత కొన్ని రోజులుగా రాగిణి ద్వివేదితో తిరుగుతున్నాడు. ఆ విషయం రవి భార్యకు తెలిసి తీవ్ర స్థాయిలో వివాదం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈ గొడవ జరగడంతో విషయం మీడియా వరకు వచ్చింది.