'హీరోయిన్లకు తెలుగు వాళ్లంటే చిన్నచూపు' అంటున్న నగ్నం బ్యూటీ

Update: 2020-07-10 02:30 GMT
ఇటీవలే నగ్నం సినిమాతో సంచలనం రేపాడు రాంగోపాల్ వర్మ. ఇక నగ్నంలో నటించిన హీరోయిన్‌ని సోషల్ మీడియాలో స్వీటీగా పరిచయం చేశాడు వర్మ. స్వీటీది వెస్ట్ గోదావరి జిల్లాలోని దేవరపల్లి చెప్పాడు. ఇక నగ్నం సినిమా విడుదల అయిందో లేదో ఇంటర్వ్యూలతో బిజీ అయిపోతుంది స్వీటీ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది స్వీటీ. ఆమె అసలు పేరు శ్రీ రాపాక. ఇండస్ట్రీలో ముద్దుగా శ్రీ అనిపిలుస్తారు. నాకు ఇండస్ట్రీతో మంచి అనుబంధమే ఉంది. టీవీ రంగంలో కూడా సత్తా చాటిందని అంటుంది. తన కెరీర్ గురించి చెప్తూ.. ‘రంగస్థలం షోతో పాటు కబడ్డీ లీగ్స్‌లో పాల్గొన్నాను.

స్టార్ వార్‌తో పాటు కిర్రాక్ కబాడీ ట్రోపీల విన్నర్‌ని నేనే. ఆ తరువాత రంగస్థలం షో చేశా.. జెమినిలోనే టాప్ రేటింగ్ షో రంగస్థలంలో చాలా రోజులు చేశా. నిజానికి నేను ఫ్యాషన్ డిజైనర్‌ని. తెలుగు, కన్నడ, తమిళ బాషలలో 40కి పైగా చిత్రాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశా. హైదరాబాద్ నిఫ్ట్‌లో చదువుకున్నా. మాస్టర్స్ యూఎస్‌లో చేశా. నిఫ్ట్‌లో చేస్తూనే సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశా. అయితే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేటప్పుడు ఓ హీరోయిన్ తో తనకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్పింది అమ్మడు. "సుప్రీం సినిమా టైంలో నేను కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసేటప్పుడు.. హీరోయిన్ రాశిఖన్నా ఓసారి 3 గంటలకు ఫోన్ చేసి చీర కట్టేందుకు రమ్మంది.

నేను గబగబా అక్కడికి వెళ్లేసరికి ఆమె చుట్టూ 150 మంది ఉన్నారు. వారిలో లేడీస్ కూడా ఉన్నారు. అక్కడ ఎవరి సాయంతో అయినా ఆమె చీర కట్టించుకోవచ్చు. నన్ను గంటల తరబడి వెయిట్ చేయించేది రాశిఖన్నా. ఆమె వలన నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది. నార్త్ నుండి వచ్చిన హీరోయిన్లు ఓ యాటిట్యూడ్‌తో ఉంటారు. అయితే ఈ విషయం డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా తెలుసు. డాన్స్ మాస్టర్ రాజుసుందరంతో కూడా రాశి పెట్టే టార్చర్ విషయం చెప్పేశా. అలా నేను రాశి విషయంలో చాలా సార్లు బాధపడాల్సి వచ్చింది. నిజానికి హీరోయిన్లకు తెలుగు వారంటే చిన్న చూపు" అని తన ఆవేదన బయటపెట్టింది స్వీటీ అలియాస్ శ్రీ.


Tags:    

Similar News