నయనతార-విఘ్నేష్ శివన్ సీక్రెట్ పెళ్లి గురించి ఓపెన్ గా తెలిశాక అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. నిజానికి నయన్ కి తన ప్రియుడితో పెళ్లయిపోయింది కానీ... ఆ విషయాన్ని దాస్తోందని కూడా తమిళ మీడియాల్లో కొన్నేళ్ల క్రితమే కథనాలొచ్చాయి. కానీ నయన్-విఘ్నేష్ జంట దానిని ఏనాడూ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ జంట సహజీవనం గురించి మాత్రమే మీడియా కథనాలు రాస్తున్నా దానిపైనా స్పందించలేదు. కేవలం నయన్ - విఘ్నేష్ మాత్రమే ఇలా చేశారా? అంటే పూర్వాపరాల్లోకి వెళితే ఇలాంటి జంటలకు రంగుల ప్రపంచంలో కొదవేమీ లేదని తేలింది.
నయనతార - విఘ్నేష్ శివన్
నయనతార -విఘ్నేష్ శివన్ ఆరేళ్ల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నారు. అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులుగా మారుతున్నట్లు ప్రకటించినందున వారిపై తమిళనాడు ప్రభుత్వం విచారణ ప్రారంభించిన తర్వాత ఈ జంట పెళ్లికి సంబంధించిన రహస్యం ఓపెనైంది. పెళ్లి గుట్టును బయటపెట్టకుండా నయన్ ఎందుకంత డ్రామా? ఆడినట్టు అంటే దానికి కారణాలు అనేకం. ముఖ్యంగా సినిమా ట్రేడ్ కి పెళ్లంటే గిట్టదన్న టాక్ ఉంది. అందుకే ఈ విషయాన్ని నయనతార దాచిందని కూడా గుసగుసలు వినిపించాయి.
రిచా చద్దా - అలీ ఫజల్
రిచా చద్దా - అలీ ఫజల్ వివాహం ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ ఒకరినొకరు పిచ్చిగా ఘాఢంగా ప్రేమించుకున్నారు. చాలా సంవత్సరాలుగా సహజీవనం చేసారు. ఈ జంట ఇటీవల వివాహ సెలబ్రేషన్ జరుపుకోవడానికి రెండేళ్ల ముందే వివాహం చేసుకున్నారు. ఈ జోడీ పెళ్లిపై రకరకాల గాసిప్పులు షికార్ చేసినా కానీ అధికారికంగా బహిర్గతం చేయకపోవడంతో ఇది కూడా సీక్రెట్ పెళ్లిగానే భావించాల్సి వచ్చింది.
జాన్ అబ్రహం- ప్రియా రుంచల్
సింహబలుడు జాన్ అబ్రహం.. తన ప్రేయసి ప్రియా రుంచల్ ను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఇప్పటి వరకు అతడు తన వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టికి దూరంగా ఉంచాడు. జాన్ ఎలా ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో కూడా చాలామందికి తెలియదు. అయితే అందాల భామ బిపాస బసుతో జాన్ ఏడెనిమిదేళ్ల పాటు సుదీర్ఘంగా డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ జంట బ్రేకప్ అయ్యింది. అటుపై బిపాసా ... టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ని పెళ్లాడింది.
ప్రీతి జింటా - జీన్ గూడెనఫ్
విదేశీ బోయ్ ఫ్రెండ్ జీన్ గుడెనఫ్ తో ప్రీతి జింటా వివాహం అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్. ఈ జంట రహస్య వివాహంపై మీడియా చాలా కథనాలు అల్లింది. పెళ్లి తర్వాత కూడా ఆమె సరోగసీ ద్వారా తల్లి అవుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ప్రీతి లైఫ్ లో ఏం చేసినా ఏ ప్రకటన వెలువరించినా అది సర్ ప్రైజింగ్ గానే ఉంటుంది. ఇంతకుముందు ఐపీఎల్ ఫ్రాంఛైజీ వ్యవహారంలో భాగస్వామితో గొడవల్లోను ప్రీతి జింతా పేరు ప్రముఖంగా హైలైట్ అయ్యింది. ఇటీవలే తన భర్త జీన్ గూడెనఫ్ తో కలిసి దీపావళి సెలబ్రేషన్ లో ఉన్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
కునాల్ కపూర్ - నైనా బచ్చన్
`రంగ్ దే బసంతి` ఫేం కునాల్ కపూర్ అమితాబ్ బచ్చన్ మేనకోడలు నైనా బచ్చన్ ను సీషెల్స్ లో వివాహం చేసుకున్నాడు. కునాల్ వివాహం చేసుకున్నాడని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అతడి వ్యక్తిత్వం గురించి తెలిసిన వారు ఇంకా బిగ్ షాక్ కి గురయ్యామని తెలిపారు.
రాణి ముఖర్జీ - ఆదిత్య చోప్రా
రాణి ముఖర్జీ - ఆదిత్య చోప్రా కొన్ని సంవత్సరాల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నారు. యష్ రాజ్ స్టూడియోలో జరిగిన ఒక కార్యక్రమంలో శత్రుఘ్న సిన్హా అనుకోకుండా ఆమెను రాణి చోప్రా అని పిలిచిన తర్వాత మాత్రమే ఇది బయటకు వచ్చింది. ఆ తర్వాత చోప్రాల ఇంట్లో గొడవలు మొదలయ్యాయని కూడా మీడియా కథనాలొచ్చాయి.
సుర్వీన్ చావ్లా - అక్షయ్ థాక్కర్
సుర్వీన్ చావ్లా పెళ్లి తన చిరకాల స్నేహితుడు అక్షయ్ థాకర్ తో అత్యంత ఆశ్చర్యకరంగా జరిగింది. ఆమె 2015 లో వివాహం చేసుకుంది. కానీ ఆలస్యంగా బయటకు తెలిసింది. ఇప్పుడు ఒక పిల్లవాడికి తల్లి. సుర్వీన్ తెలుగులో రాజశేఖర్ సరసన `రాజు మహారాజు` అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
సినీపరిశ్రమలో రహస్య వివాహాలు చాలా సహజం. కొన్ని సంవత్సరాల సహజీవనం తర్వాత పెళ్లయిందని ప్రకటించే జంటలకు కొదవేమీ లేదు.