పొట్టి స్కర్ట్‌ లో సీనియర్ బ్యూటీ మెరుపులు

Update: 2022-11-17 01:30 GMT
ముద్దుగుమ్మ శ్రియ శరణ్‌ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు పూర్తి అయ్యింది. ఈ అమ్మడి వయసు నాలుగు పదులకు చేరువ అయ్యింది. అయినా కూడా అందం విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. పాతికేళ్ల పడుచు అమ్మాయి  మాదిరిగా అందాల ఆరబోత చేస్తూ ఆహా అనిపిస్తుంది. తాజాగా ధృశ్యం 2 హిందీ వర్షన్‌ లో నటించిన శ్రియ అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

ముద్దుగుమ్మ శ్రియ యొక్క ఫోటోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు ఇలా మినీ స్కర్ట్‌ లో మెప్పించింది. క్లీవేజ్ షో చేయడంతో పాటు థైస్ అందాలను చూపిస్తూ అలా నవ్వులు చిందించుకుంటూ వెళ్తున్న ముద్దుగుమ్మ శ్రియ శరణ్‌ ను చూస్తూ ఉంటే ఆహా అనకుండా ఉండలేం.

తెలుగు లో కూడా ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను చేస్తూనే ఉంది. ఆర్ ఆర్‌ ఆర్‌ లో చిన్న పాత్ర లో నటించిన ఈమె ప్రస్తుతం ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కాకున్నా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దృశ్యం 2 సినిమా హిందీలో సక్సెస్ అయితే ఈ అమ్మడు మళ్లీ రెండు మూడు సంవత్సరాల పాటు అక్కడ బిజీ బిజీగా సినిమాలు చేసే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఒక బిడ్డకు తల్లి అయినా కూడా ఇండస్ట్రీ లో ఇంత బిజీగా ఉన్న హీరోయిన్స్‌ కొద్దిమంది మాత్రమే ఉంటారు. వారిలో శ్రియ ఒకరు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News