శోభిత ధూళిపాళ‌ని న‌ల్ల‌గా ఉంద‌నేవారా?

Update: 2023-06-24 08:00 GMT
తెలుగు న‌టి శోభిత ధూళిపాళ ఇప్పుడిప‌పుడే బిజీ అవుతుంది.  భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో సైతం అవ‌కాశాలు అందుకుంటుంది. ఇటీవ‌లే 'పొన్నియ‌న్ సెల్వ‌న్ -2'లో న‌టించి భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. త్వ‌ర‌లో 'ది నైట్ మేనేజ‌ర్ -2' తోప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇంకా కోలీవుడ్ లో కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు క్యూలో ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో కెరీర్ ఆరంభంలో ఎదురైన అవ‌మాన సంఘ‌ట‌న‌ల్ని త‌లుచుకుంది. ఆ వేంటో ఆమె మాట‌ల్లోనే..

'ఏ రంగంలోనైనా ప్రారంభం యుద్దంలా అనిపిస్తుంది. నేను యాడ్స్ లో న‌టించేట‌ప్పుడు తెల్ల‌గా లేన‌ని అనేవారు.  అందంగా లేనని..ఆ యాడ్ కి నువ్వు స‌రిపోవ‌ని ముఖం మీద‌న అనేవారు.  అయినా నేను అప్పుడు బాధ‌ప‌డ‌లేదు. నా దృష్టిలో అంద‌మ‌నేది ఎదుట‌వారి ఆలోచ‌న‌ల‌కు సంబంధించిన అంశం. నా రూపాన్ని చూసి ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో? అని ఆలోచించ‌డం మానేసాను.

దానికి బ‌ధులుగా క్రియేటివ్ గా ఉండ‌టం..కొత్త‌గా ఉండ‌టం కోసం సీనియ‌స్ గా ఆలోచించేదాన్ని. చేసే ప‌నిని మ‌రింత శ్ర‌ద్ద‌గా చేయ‌డం అల‌వాటు చేసుకున్నా.  అదే న‌న్ను ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మ‌య్యేలా చేసింది. గుర్తించేలాగా చేసింది.

క‌మ‌ర్శియ‌ల్ సినిమ‌ల్లో అవ‌కాశాల కోసం ఎదురుచూస్తూ ఉండ‌కుండా వ‌చ్చిన ప్ర‌తీ ఆడిష‌న్ కి వెళ్లేదాన్ని.  మొద‌టి సారి అనురాగ్ క‌శ్య‌ప్ తో క‌లిసి ప‌నిచేసాను.  ఆసినిమాతో చాలా పాఠాలు నేర్చుకున్నాను.  న‌టించాలి అనే త‌ప‌న ఉన్న‌ప్పుడు ఎలాంటి క‌ష్ట‌మైనా బాధించ‌దు.

మొద‌టిసారి కెమెరా ముందుకు వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఉన్నానో?  ఇప్పుడు అలాగే ఉన్నాను.  నా రూపంలో కాస్తో కూస్తో మార్పులొచ్చి ఉండొచ్చు. కానీ  నా లో మార్పులు మాత్రం రాలేదు' అని తెలిపింది.

ఇక ఈ బ్యూటీ పై ఓ రూమ‌ర్ కూడా కొన్ని నెల‌లుగా వైల‌ర్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో హీరో తో స‌న్నిహితంగా ఉంటుంద‌ని వార్త‌లొస్తున్నాయి.  ఆ జంట కెమెరాకి చిక్కిన సంద‌ర్భాలున్నాయి. పెళ్లి కూడా చేసుకుంటార‌ని వార్త‌లొస్తున్నాయి. అయితే వీటిపై ఇంత‌వ‌ర‌కూ స్పందించింది లేదు.
Tags:    

Similar News