నిప్పు లేనిదే పొగ రాదంటారు. అలాంటిది డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో ఒక యువకుడితో దిగిన ఫోటోను ఒక హీరోయిన్ పోస్టు చేస్తే? అంతకు మించిన పని ఇంకేం ఉంటుంది. ఎందుకోసం చేశారో కానీ.. ఒక యువకుడితో దిగిన ఫోటోను హీరోయిన్ సునైనా పోస్టు చేశారు. సునైనా అనే హీరోయిన్ ఉందా? అన్న అనుమానం అక్కర్లేదు. తెలుగులో పేరు ప్రఖ్యాతులు లేవు కానీ.. కోలీవుడ్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువే. కొద్దికాలం క్రితం కుమారి వర్సెస్ కుమారి.. టెన్త్ క్లాస్ లాంటి సినిమాల్లో నటించినా తెలుగులో పెద్దగా పేరు రాలేదు. అయితే.. తమిళంలో మాత్రం ఆమెకు మంచి ఫాలోయింగే ఉంది.
తాజాగా ఒక యువకుడితో ఉన్న ఫోటోను సునైనా తన ఇన్ స్ట్రాగామ్ లో పోస్టు చేశారు. అంతే.. సోషల్ మీడియాలో కొత్త ప్రచారం షురూ అయ్యింది. హీరోయిన్ స్వయంగా ఒక కుర్రాడితో ఉన్న ఫోటో దిగితే సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా? ఆమెకు.. ఆ కుర్రాడికి లింకు పెట్టేశారు. అది కాస్తా వైరల్ అయిపోయి.. ఆమెకే నేరుగా పెళ్లి శుభాకాంక్షలు చెప్పటం షురూ చేశారు.
దీంతో.. సర్ ప్రైజ్ కు గురైన ఆమెకు అసలు విషయం అర్థమైంది. అరేరే.. పెళ్లి చేసుకుంటే చెప్పి చేసుకుంటా కానీ..రహస్యంగా చేసుకోవాల్సిన అవసరమే లేదని తేల్చింది. అయినప్పటికి సునైనా మాటల్ని పట్టించుకోకుండా ఆమె పెళ్లి వార్తను వైరల్ చేస్తున్నారు. దీంతో.. విపరీతంగా వేదన చెందుతోంది. పెళ్లి రూమార్స్ ను ఖండించినా తన పెళ్లిని ఇంకా చేస్తున్నారని వాపోతోంది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఆమె వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. పెళ్లి రూమర్స్ ను ఖండించటం వరకూ బాగానే ఇంతకూ ఇన్ స్టా లో పోస్టు చేసిన కుర్రాడు ఎవరో కాస్త క్లారిటీ ఇస్తే బాగుండేదేమో?