ఏజ్ తో కొందరికి పని లేదు. ఏజ్ లెస్ బ్యూటీగా తమదైన అందం యవ్వనంతో అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు. ఇదే కేటగిరీకి చెందుతారు జాతీయ ఉత్తమ నటి టబు. అసలు తన వయసు హాఫ్ సెంచరీ దాటింది అంటే ఎవరూ నమ్మరు. తన లైఫ్ లో రెండున్నర దశాబ్ధాల పాటు సినీపరిశ్రమకు కథానాయికగా సేవలందించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటిగా గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకున్న టబు నాయికా ప్రధాన పాత్రలతోనూ మెరిపించారు. తెలుగు-తమిళం- హిందీ చిత్రసీమల్లో అగ్ర నాయికగా సత్తా చాటారు.
టబు వయసు 51.. కానీ అది కనిపెట్టడం అంత సులువు కాదని తాజాగా రివీలైన ఫోటోలు వీక్షిస్తే అర్థమవుతుంది. తాజా మీడియా సమావేశంలో టబు ఇలా కాలు మీద కాలు వేసుకుని ఎంతో ఠీవిగా కూచుని మీడియా ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టోటల్ బ్లాక్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు.
టబు క్రేజీ ప్రాజెక్ట్ ఖుఫియా..!
విశాల్ భరద్వాజ్ `ఖుఫియా` చిత్రాన్ని గత సంవత్సరం ప్రకటించినప్పటి నుండి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కొత్త చిత్రం గురించి మరింత తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. ప్రతిదీ ఉత్కంఠ కలిగించే విషయాలు ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. ఇంతకుముందే ప్రముఖ దర్శక నిర్మాత విశాల్ భరద్వాజ్ తన సోషల్ మీడియా స్పేస్ లో స్పై థ్రిల్లర్ `ఖుఫియా` ఫస్ట్ లుక్ ను షేర్ చేసారు. ఇందులో టబు- అలీ ఫజల్ - వామికా గబ్బి- ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్పేస్ లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో టబు టెన్షన్ గా కనిపిస్తుండగా అలీ ఫజల్ పాత్ర నవ్వు తెప్పిస్తుంది. ఆశిష్ విద్యార్థి -వామికా గబ్బి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు. నేపథ్య సంగీతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఖుఫియా భారతదేశ రక్షణ రహస్యాలను విక్రయించే ద్రోహిని గుర్తించడానికి నియమించబడిన ఒక RAW కార్యకర్త కృష్ణ మెహ్రా గురించిన కథ.. ఇది అమర్ భూషణ్ రాసిన `ఎస్కేప్ టు నోవేర్` అనే గూఢచర్యం నవల ఆధారంగా రూపొందింది.
విశాల్ భరద్వాజ్ - టబు కాంబినేషన్ అంటేనే రక్తి కట్టించే కంటెంట్ తప్పనిసరిగా ఉంటుంది. హైదర్ -మక్బూల్ వంటి అనేక హిట్ చిత్రాలను అందించారు ఈ జోడీ. గత సంవత్సరం టబు తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ లో ఖుఫియా గురించి వెల్లడించారు.
విశాల్ తో నేను మళ్లీ కలిసి పని చేస్తున్నందుకు ఆనందంగా ఉందని టబు అన్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఇది అతి త్వరలో విడుదల కానుంది. న్యాయం వ్యక్తిగతమైనది. ఇది నిజ సంఘటనల నుండి ప్రేరణ పొందిన స్పై థ్రిల్లర్. కేవలం Netflixలో మాత్రమేనని తెలిపారు. టబు అడపాదడపా తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.