అందాల కథానాయిక శ్రుతిహాసన్ లాస్.. మిల్కీబ్యూటీ తమన్నాకి గెయిన్. శ్రుతి తీరిక లేక వదులుకున్నది తమన్నా తీరిక చిక్కించుకుని తెలివిగా ఒడిసిపట్టుకుంది. దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు. ఈ సినిమా శ్రుతికి రాసి లేదు. శ్రుతితో పాటు తమన్నా కూడా బిజీ నాయికనే. కాకపోతే అవకాశం వచ్చినప్పుడు ఒడిసిపట్టడం ఎలానో తెలిసిన నాయిక. అందుకే నాగార్జున-కార్తీ హీరోలు పీవీపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన మల్టీస్టారర్‌ని తెలివిగా ఒడిసి పట్టుకుంది. శ్రుతి తెలివి తక్కువగా తప్పుకుంది. కాల్షీట్ల సర్ధుబాటు అనేది సమస్య కానేకాదు. కాస్త తీరిగ్గా ఆలోచిస్తే తరుణోపాయం దొరికేదే. కానీ శ్రుతి తొందరపాటు నిర్ణయం గొడవలకు కారణమైంది. కోర్టు వరకూ వెళ్లాల్సొచ్చింది. ఏదేమైనా శ్రుతి ఎగ్జిట్‌తో తమన్నా ఇన్ అయ్యింది. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో చిత్రీకరణ సాగుతోంది. సైలెంటుగా నిన్ననే ఈ సినిమా మొదలెట్టేశారు. షూటింగ్ చేసేస్తున్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్నా ఎంతో ఉత్సాహంగా సెట్స్‌కి వస్తోందని సమాచారం. సైలెంటుగా కోసేయడం అంటే ఇదే మరి!