ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డమ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. బాహుబలి సంచలన విజయంతో ప్రభాస్ ని పాన్ ఇండియన్ స్టార్ అని పిలిచారు. బాహుబలి ఫ్రాంఛైజీతో దాదాపు 2000 కోట్లు కొల్లగొట్టిన స్టార్ గా ప్రభాస్ స్టార్ డమ్ గురించి దేశవిదేశాల్లో మార్మోగింది. ఆ తర్వాత కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో యష్ బృందం ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో ప్రవేశించగా.. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో రాజమౌళి మరోసారి 1000 కోట్ల క్లబ్ ని రిపీట్ చేసాడు. ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్లుగా అవతరించారు. తెలుగు స్టార్ల ఎదుగుదల పాన్ ఇండియా స్టార్ డమ్ ఖాన్ ల త్రయానికి కూడా ఇంకా డైజెస్ట్ కాలేదు. బచ్చన్ లు రోషన్ లు కపూర్లకు కూడా సౌత్ లో అసలేం జరుగుతోందో అర్థం కాలేదు.
ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఇప్పుడు హిందీ తారలంతా సౌత్ డైరెక్టర్లు సౌత్ స్టార్లతో కలిసి మల్టీస్టారర్లను ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల పూర్తిగా సౌత్ ట్యాలెంట్ పైనే ఖాన్ లు సైతం డిపెండ్ అయిపోయారు. ఇక్కడి వారిని పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో తమన్నా చేసిన ఒక వ్యాఖ్య దుమారం రేపింది.
అసలు పాన్-ఇండియా స్టార్ డమ్ అనేది అమితాబ్ బచ్చన్- షారుఖ్ ఖాన్ లతో ముగిసింది అని మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు పాన్ ఇండియా అనేదే పెళుసైన పదం అంటూ అసహ్యం వ్యక్తం చేసింది. తమన్నా భాటియా పాన్-ఇండియా స్టార్ డమ్ అనే భావనపై తన మనసులోని మాటను అస్సలు దాచుకోలేదు. దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించింది.
ప్రాంతీయ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా హిందీ చిత్ర పరిశ్రమలోను సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో కలిసి తమన్నా నటించిన బాహుబలి రికార్డులు బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. అత్యంత ప్రజాదరణ పొందిన పాన్-ఇండియా చిత్రాలలో ఒకటిగా నిలిచింది. బాహుబలి ఫ్రాంఛైజీ ఏకంగా 2200 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. ఈ రోజు తమన్నాను పాన్-ఇండియా స్టార్ అని పిలుస్తున్నారంటే దానికి కారణం బాహుబలిలో అవంతిక పాత్ర. కానీ పాన్ ఇండియా స్టార్ డమ్ గురించి ప్రస్థావిస్తూ తమన్నా కేవలం అమితాబ్- షారూఖ్ తోనే అది అంతమైంది అని అనడం ఆశ్చర్యపరిచింది.
అయితే తమన్నా ఉద్ధేశంలో అమితాబ్ బచ్చన్- షారూఖ్ లను మించిన `పెద్ద స్టార్స్` లేరనే భావన బయటపడింది. ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ``స్టార్ డమ్ ఆలోచన మారిందని నేను భావిస్తున్నాను. బిగ్గెస్ట్ స్టార్ అనే కాన్సెప్ట్ ఉందని నేను అనుకోను. నేను చెప్పేది ఏమంటే.. అది షారుఖ్ ఖాన్ మిస్టర్ అమితాబ్ బచ్చన్ తో ముగుస్తుంది`` అని తమన్నా వ్యాఖ్యానించింది.
అయితే ఈ గేమ్ షోలోనే తమన్నాకు ఇష్టమైన పాన్-ఇండియా సూపర్ స్టార్ ఎవరు? అని ప్రశ్నించగా...``ఇది చాలా దుర్బలమైన పదం. దురదృష్టవశాత్తు.. ఈ పాన్-ఇండియా ఒక కొత్త దృగ్విషయం.. కొత్త వ్యామోహం``అంటూ లైట్ తీస్కుంది.
తమన్నా ప్రస్తుతం హిందీలో నటిస్తోంది. 32 ఏళ్ల ఈ బ్యూటీ సెప్టెంబర్ లో రెండు బ్యాక్-టు-బ్యాక్ OTT విడుదలలతో అభిమానుల ముందుకు వచ్చింది. బాబ్లీ బౌన్సర్ డిస్నీ+ హాట్ స్టార్ లో విడుదల కాగా.. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ `ప్లాన్ ఎ ప్లాన్ బి`లో ఆమె రితీష్ దేశ్‌ముఖ్ సరసన నటించింది. అలాగే తమన్నా మలయాళంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అరుణ్ గోపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిలీప్ కథానాయకుడిగా కనిపించనున్నారు.
మరోవైపు ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్ నవంబర్ 11న విడుదల కానున్న తన సినిమా `ఉంఛై` ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అలాగే షారుఖ్ ఖాన్ ఇటీవలే తన పునరాగమన చిత్రం పఠాన్ నుండి తాజా స్టిల్ ను షేర్ చేసాడు. అతడు నటిస్తున్న పఠాన్- జవాన్- డుంకీ చిత్రాలు 2023లో విడుదల కానున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.