హ్యాపీడేస్ తో టాలీవుడ్ లో పాపులారిటీని దక్కించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా అప్పటి నుండి దాదాపుగా దశాబ్ద కాలం పాటు వెనక్కి తిరిగి చూసుకోకుండా హీరోయిన్ గా చేసిన విషయం తెల్సిందే. మహేష్ బాబు.. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. పవన్ కళ్యాణ్.. ప్రభాస్.. చిరంజీవి.. నాగ చైతన్య ఇంకా ఎంతో మంది సీనియర్ మరియు జూనియర్ స్టార్ హీరోలతో సినిమా ను చేసిన ఘనత తమన్నా దక్కించుకుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా ఈమద్య కాలంలో కాస్త డల్ అయ్యింది కాని ఖచ్చితంగా ఈ అమ్మడు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల తో హడావుడి చేయించగల సత్తా ఉన్న నటి అంటూ ఇప్పటికి కూడా అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈమద్య కాలంలో ఈ అమ్మడి పెళ్లి విషయం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంది. గత కొన్ని నెలలుగా ఈమె పెళ్లి పీఠలు ఎక్కబోతుంది అంటూ వస్తున్న వార్తలకు క్లారిటీ దక్కింది.
హీరోయిన్ గా ఆఫర్లు రాకపోవడంతో తమన్నా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేందుకు సిద్దం అయ్యిందని.. కుటుంబ సభ్యులు ఆమెకు ఒక మ్యాచ్ కూడా ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో తమన్నా పెళ్లి పై తన అభిప్రాయం చెప్పింది. పెళ్లి చేసుకోవాల్సిందే.. కాని తన పెళ్లికి మాత్రం ఇప్పుడు సమయం కాదని పేర్కొంది. పెళ్లి విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లే అంటూ కొట్టి పారేసింది.
మరో రెండు సంవత్సరాల వరకు పెళ్లి ప్రస్థావన తన వద్ద తీసుకు రావదంటూ కుటుంబ సభ్యులకు చెప్పిందట. 2025 లో పెళ్లి పీఠలు ఎక్కి తమన్నా ఒక గృహిణిగా మారే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి విషయాన్ని పూర్తిగా ఆమె నిర్ణయాధికారానికి వదిలేశారట.
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే చిరంజీవి నటిస్తున్న ఒక సినిమాలో ఈమె నటిస్తుంది. అంతే కాకుండా తమిళం లో కూడా ఈమె ఒక సినిమాకు కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు మిల్కీ బ్యూటీ వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తు ఆకట్టుకుంటూ ఉంది. ఇటీవల ఒక మ్యూజిక్ వీడియో లో కూడా కనిపించి తన అందంతో అభిమానులకు కన్నుల విందు చేసింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఆఫర్లు తగ్గినా కూడా ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికి కూడా పారితోషికం కోట్ల లోనే ఉంటుందట.