బాలీవుడ్ లో నానా పటేకర్ మీద ఆరోపణతో తనుశ్రీదత్తా మొదలుపెట్టిన మీటూ మాటలు ఇంకా దావాలనంలా చిచ్చు పెడుతూనే ఉన్నాయి. సౌత్ దాకా పాకిపోయి ఏ నిమిషంలో ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయో అన్న టెన్షన్ తో సినిమా జనం బిక్కుబిక్కుమంటున్నారు. తన మీద ఆరోపణలు చేసిన తనుశ్రీ మీద లీగల్ గా ప్రొసీడ్ అవుతానన్న నానా పాటేకర్ దాని గురించి మీడియా ముందు మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ఇక తనుశ్రీ లెస్బియన్ అంటూ తన మీద పది పన్నెండు సార్లు రేప్ అటెంప్ట్ చేసిందంటూ మాజీ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ తీవ్రమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దాన్ని కొట్టిపారేసి 10 కోట్ల నష్టపరిహారం దావాకు సిద్ధపడిన తనుశ్రీ తనతో రాఖీ బాండింగ్ గురించి చాలా డిటైల్డ్ గా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులో షాకింగ్ కలిగించే అంశాలు ఉండటం మీడియా సైతం ఊహించనిది.
దాని ప్రకారం తనుశ్రీ రాఖీ సావంత్ ని చివరి సారి 2009లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం లాంజ్ లో కలుసుకుంది. అక్కడ ఉన్న రాఖీ సావంత్ మాట మాట కలుపుతూ చనిపోయాక స్వర్గం చేరుకోవాలి అంటే జీసస్ ను నమ్మి క్రిస్టియన్ గా మారాలని చెప్పింది. అంతే కాదు హిందూ దేవుళ్లను విగ్రహాలుగా పూజించడం అంటే దెయ్యాలను మొక్కడం లాంటిదే అంటూ తీవ్ర పదజాలంతో దూషించే సాహసం చేసింది. దానికి బదులుగా తనుశ్రీ స్వర్గం నరకం ఎక్కడున్నాయో చెబితే అప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. దీంతో కొంత వాదప్రతివాదనల తర్వాత అది అక్కడితో ముగిసిపోయింది. ఇదీ తనుశ్రీ చెప్పిన ఫ్లాష్ బ్యాక్.
అంతే కాదు తనుశ్రీలో మగాడు ఉన్నాడు కాబట్టే కొన్నేళ్ల క్రితం గుండు కొట్టించుకుంది అనే కామెంట్ కు వివరణ ఇస్తూ హిందూ ధర్మంలో సన్యాసం కానీ దీక్ష కానీ తీసుకునే సమయంలో జుత్తుని పూర్తిగా తీయించుకోవడం సాధారణమని అందులో రాఖీ చెప్పెంత చెడు ఉద్దేశం ఏమి లేదని వివరణ ఇచ్చింది. తనను హోమో సెక్సువల్ అని పదే పదే అంటున్న రాఖీ సావంత్ మీద తనుశ్రీ ఆగ్రహం మాములుగా లేదు. ఇలాంటి వాళ్ళ వల్లే జనంలో కులమతాల గురించి మనోభావాల వ్యత్యాసాలు వస్తున్నాయని విడమరిచి చెబుతోంది. ఇప్పుడు ఇద్దరి మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కావడం లేదు. మొత్తానికి మీ టూ ఇష్యూ ఎన్నడూ చూడని వినని సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తోంది. ఎవరో ఒకరు వర్మ లాంటి వాళ్ళు దీని మీద సినిమా తీసినా ఆశ్చర్యం లేదు