'మా' ప్రెసిడెంట్ పై నటి ట్విటాకిచ్చిందే

Update: 2017-07-05 13:20 GMT
శివాజి రాజా అప్పట్లో కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా.. ఎక్కువగా సైడ్ కేరక్టర్స్ మాత్రమే చేశాడు. హీరోగానే కనిపించాలనే పట్టుదల లాంటివేమీ కనిపించేవి కాదు కానీ.. ప్రస్తుతం మా ప్రెసిడెంట్ ఎంపికైన తర్వాత.. శివాజి రాజా స్వరం స్థాయి పెరిగిన విషయం.. పలు సందర్భాల్లో కనిపిస్తూనే ఉంది. అయితే ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా కూడా.. శివాజీ స్వరాన్ని ఇప్పుడు ఒక సీనియర్ నటి ఖండిస్తోంది. ట్విట్టర్లో ఎటాక్ ఇచ్చింది. అదే.. ట్విటాకిచ్చింది.

ఇప్పుడు సీనియర్ నటి తులసి.. శివాజీ రాజాపై నేరుగానే విమర్శలు గుప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తిని జోకర్ తోను.. బఫూన్ తోనూ పోల్చేసింది తులసి. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్న తులసి.. శంకరాభరణం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం సీనియర్ ఆర్టిస్ట్ స్థాయికి చేరుకోగా.. కొన్ని రోజుల క్రితం శంకరాభరణం అవార్డ్స్ ను ఈమె ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తసహా పలువురు స్టార్లను ఆహ్వానించగా.. ఎవరూ అటెండ్ కాలేదన్న మాట వాస్తవమే. అయితే.. ఇలా స్టార్లు ఎవరూ తమ కార్యక్రమానికి రాకుండా.. మా ప్రెసిడెంట్ గా ఉన్న శివాజి రాజా అడ్డుకున్నాడని తులసి ఆరోపిస్తున్నారు.

తన పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని.. ఆ సీట్ లో కూర్చున్న బఫూన్ అని.. అదేమీ పర్మినెంట్ సీట్ కాదని తెలుసుకోవాలని.. ఇలా రకరకాలుగా శివాజి రాజాను ట్విట్టర్ లో తిట్టిపోయడమే కాకుండా.. పలు ఛానెల్స్ ను ట్యాగ్ చేస్తూ ఈ మెసేజ్ లు పెడుతుండడం విశేషం. కాకపోతే ఆమె పేరుతో వస్తున్న ట్వీట్లు.. ఆమె పేరుతో ఉన్న ఎకౌంట్ వెరిఫైడ్ మాత్రం కాదు. కాబట్టి ఆ ట్వీట్లన్నీ తులసీ వేసిందా లేదా అనే విషయం చెప్పలేం. ఇక అవార్డు ఫంక్షన్లకు నటులు రావడం అనేది.. ఫిలింఫేర్లు ఐఫాలు సైమాలకే మన పెద్ద హీరోలు రావట్లేదు కదా.. తులసి అవార్డులకు వచ్చేస్తారా అనేది ఆమె కూడా ఆలోచిస్తే బెటరేమో. అందులో 'మా' ప్రమేయం ఏముంటుందిలే.
Tags:    

Similar News