తాగి ర‌చ్చ చేసిన హీరోయిన్ పై కేసు!

Update: 2017-07-11 12:07 GMT
తెలుగులో హీరోయిన్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించిన ఊర్వ‌శి త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. ఆమె ప‌బ్లిక్ ప్రోగ్రాంల‌లో తాగి వ‌చ్చి నానా ర‌చ్చ చేస్తోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కుటుంబ క‌ల‌హాలను ప‌రిష్క‌రించే నేప‌థ్యంలో... మలయాళ భాష‌లో జీవితం సాక్షి అనే ప్రోగ్రాం కు ఊర్వ‌శి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్ర‌మానికి ఊర్వ‌శి ఫుల్ గా మందు కొట్టి వచ్చిందట. ఆ మ‌త్తులో ఆమె అడిగిన‌ ప్రశ్నల వల్లే తమ కుటుంబం విడిపోయిందని, తమ ఇంటి గుట్టును బజారున పెట్టిందని ఊర్వ‌శిపై కేరళలోని ఒక మహిళ ఆ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసింది.

ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు ఊర్వ‌శి ప్రవర్తన చూసి షాక్ అయ్యార‌ట‌. షో చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఈమె తాగి వచ్చిందని తెలిసిపోయింద‌ట‌. ఈ షో నిర్వాహకులు, లాయర్లు కూడా ఊర్వశి ప్రవర్తన కి విస్తుపోయారట. కార్యక్రమాన్ని చూసే సాధారణ ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని పసిగట్టారట.

రెండేళ్ళ క్రితం ఎల్.డి.ఎఫ్ ఆర్గనైజ్ చేసిన ఫీమేల్ లేగిస్లేటివ్ స్టాఫ్ కమీషన్ మీటింగ్ కు ఊర్వ‌శి ఆలస్యంగా వ‌చ్చింది. అంతేకాదు, స్టేజ్ మీదకి  తూగుతూ, తూలుతూ వెళ్ళి నోటికి వ‌చ్చింది మాట్లాడేసింది. ఊర్వశి ఇలా పబ్లిక్ ఈవెంట్ లో మందు తాగి మత్తులో బిహేవ్ చేయడం ఇదేమీ మొదటి సారి కాదు.

గత సంవ‌త్స‌రం తన విడాకుల కేసు హియరింగ్ సంద‌ర్భంగా ఎర్నాకులంలోని ఫ్యామిలీ కోర్టుకు కూడా ఆమె తాగి వచ్చింది. తాగిన మైకంలో ఆమె అక్క‌డ నానా రచ్చ చేసింద‌ని వార్త‌లొచ్చాయి. అయితే గతసంవత్సరం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మళ్ళీ ఆ కేసు నడుస్తున్న క్రమం లో మళ్ళీ తెరమీదకి వచ్చింది.
Tags:    

Similar News