తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా విలన్ పాత్రలో నటించేందుకు కూడా సిద్దం అయ్యింది. హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్న సమయంలోనే విలన్ గా - క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన వరలక్ష్మి త్వరలో మరో కొత్త పాత్రను కూడా పోషిస్తానంటూ ప్రకటించింది.
రాజకీయాల గురించి ఒక కార్యక్రమంలో పాల్గొన్న వరలక్ష్మి మాట్లాడుతూ... సామాన్యులు అంతా కూడా రాజకీయాలకు తమకు సంబంధం లేదు అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలతో సంబంధం కలిగి ఉంటారు. రాజకీయాలు అనేవి ప్రజలకు మేలు చేయడం - వారి అభివృద్దికి పాటు పడటం కోసం మంచి వేదిక. రాజకీయాల్లో ఉంటే నలుగురికి మంచి చేయవచ్చు అనేది నా అభిప్రాయం. అందుకే తప్పకుండా రాజకీయాల్లోకి వెళ్తాను - మంచి టైం చూసి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తానంటూ ప్రకటించింది.
తన తండ్రి రాజకీయ పార్టీతో ప్రస్తుతానికి తనకు సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఏ పాత్ర పోషించినా జీవించగల సత్తా ఉన్న వరలక్ష్మి రియల్ టైం పొలిటీషియన్ గా ఎలా రాణిస్తుందో చూడాలి.