మొగుడితో హీరోయిన్ విడిపోయింది అందుకేనట.. సింగర్ తో అఫైర్ పెట్టుకున్న నటి!
ప్రముఖ హాలీవుడ్ దంపతులు కిమ్ కర్దాషియన్, కాన్యే వెస్ట్ విడాకులకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచీ విడిగా ఉంటున్న వారిద్దరూ.. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. తన నలుగురు పిల్లలను తీసుకొని భార్య కిమ్ కర్దాషియన్ లాస్ ఏంజిల్స్ లో ఉంటోంది. కాన్యే వెస్ట్ మాత్రం వోమింగ్ లో ఒంటరిగా ఉంటున్నారు.
వీరిద్దరూ పెళ్లి చేసుకొని దాదాపు ఏడేళ్లు గడిచాయి. 2014లో ఈ స్టార్ జంట పెళ్లి చేసుకుంది. వీరికి మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే.. కాల క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఆ తర్వాత అవి పరిష్కరించలేనంతా ముదిరిపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఆ విభేదాలు ఏంటన్నది మాత్రం అప్పట్లో తెలియలేదు.
అయితే.. తాజా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ జంట విడిపోవడానికి భార్య కర్దాషియన్ వ్యవహారమే కారణమని సమాచారం. ఆమె కెనడియన్ పాప్ స్టార్ డ్రేక్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎవరో కాదు.. స్వయంగా డ్రేక్ ప్రకటించడంతో సంచలనం రేకెత్తింది.
డ్రేక్ ఇటీవల ''వాంట్స్ అండ్ నీడ్స్'' అనే తన కొత్త వీడియో ఆల్బమ్ ను రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా కిమ్ పేరు ఎత్తకుండా.. ఆమెతో తనకు అఫైర్ ఉందని ప్రకటించాడు. దీంతో.. కాన్యే వెస్ట్ తో ఈమె విడిపోవడానికి అసలు కారణం ఇదేనని చెప్పింది హాలీవుడ్ మీడియా. ఇప్పుడే కాకుండా.. గతంలోనూ కిమ్ తో తాను డేటింగ్ చేస్తున్నట్టు ప్రకటించాడు డ్రేక్. మొత్తానికి.. ఈ కారణం చేతనే భార్యాభర్తలు విడిపోయారనే విషయం అర్థమవుతోంది.