ముగ్గురు భామల ముద్దుల కల్కి!

Update: 2018-10-31 04:34 GMT
సీనియర్ హీరో రాజశేఖర్ 'గరుడ వేగ' సినిమా తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచినప్పటికీ మంచి చిత్రంగా అందరితో ప్రశంసలు అందుకుంది.  'గరుడ వేగ' ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు రాజశేఖర్ 'కల్కి'సినిమాకు రెడీ అవుతున్నాడు.

'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం 1983 లో సాగే ఒక పీరియడ్ థ్రిల్లర్ అని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం రూ. 5 కోట్లతో ఒక భారీ సెట్ ను నిర్మించడం జరిగిందట.  కథ డిమాండ్ చేసిన దాన్ని ప్రకారం బడ్జెట్ ను కాస్త ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుందని కూడా అంటున్నారు.  స్టొరీ మంచిదయినా సినిమా బాగున్నా 'గరుడ వేగ' కు లాభాలు రాలేదు. అలాంటప్పుడు రాజశేఖర్ మరోసారి తన మార్కెట్ కు మించిన బడ్జెట్ సినిమాకు ఖర్చు చేయడం సరైనపని కాదని ఇండస్ట్రీ లో సీనియర్స్ అభిప్రాయపడుతున్నారు.  రూ. 15 కోట్ల లోపు బడ్జెట్ ఉంటేనే రాజశేఖర్ సినిమా సేఫ్ జోన్ లో ఉన్నట్టని వారు అంటున్నారు.

80ల లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ కథ రాసుకున్నాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ. రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేశారు.  'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మెప్పించిన నందిత శ్వేత.. 'ఎవడు' ఐటెం భామ స్కార్లెట్ విల్సన్ ల తో పాటు 'హార్ట్ ఎటాక్' బ్యూటీ అదా శర్మ లు 'కల్కి' కి గ్లామర్ అద్ధనున్నారు.  ఈ సినిమాను సీ. కళ్యాణ్ తో కలిసి హీరో రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.
   

Tags:    

Similar News