కుర్ర‌ది కొరియోగ్రాఫ‌ర్ అయిపోతుందేమో

Update: 2018-05-12 01:30 GMT
చేతిలో సినిమాలు లేక‌పోతే హీరోయిన్లు చేసే ప‌నేంటీ? ఎంచ‌క్కా ఫోటోలు తీసుకోవ‌డం హాట్ హాట్‌ గా వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం. గతేడాది కమాండో 2 విడుద‌ల‌య్యాక అమ్మ‌డికి ప‌ని లేకుండా పోయింది. ప్ర‌స్తుతం ఏ సినిమాలోనూ న‌టిస్తున్న స‌మాచారం లేదు. అందుకే ఇన్‌ స్టాగ్రామ్‌ లు యువ‌త మ‌తి చెడ‌గొట్టేలా డ్యాన్సు చేస్తూ వీడియోలు పెడుతోంది.

అమాయ‌క‌పు ముఖంతో చ‌క్క‌గా ఉంటుంది అదా శ‌ర్మ‌. కానీ ఇంత‌వ‌ర‌కు ఏ భాష‌లోనూ ఆమెకు మంచి బ్రేక్ రాలేదు. చివ‌రికి చిన్న చిన్న పాత్ర‌లు సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసేందుకు సిద్ధ‌ప‌డింది. దీంతో తెలుగులో మెయిన్ హీరోయిన్‌ గా తీసుకునేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గుతున్నారు. తెలుగులో రెండేళ్ల క్రితం వ‌చ్చిన క్ష‌ణం సినిమా త‌రువాత ఆమె మ‌ళ్లీ క‌నిపించింది లేదు. తెర‌మీద క‌నిపించ‌క‌పోయినా అభిమానుల‌కు అందాల విందు చేస్తూనే ఉంది అదా. బ్యాక్‌లెస్ టాప్‌లు పొట్టి నిక్క‌ర్లు వేసుకుని ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఫోటోలు పెడుతూనే ఉంది. అందులోనూ ఫిట్‌ నెస్ ఫ్రీక్ అయిన అదా యోగాలో ప‌ర్‌ ఫెక్ట్‌. యోగా చేస్తున్న‌ప్ప‌టి వీడియోలు కూడా పోస్టు చేస్తుంది.

అదాకు మ‌రో ఇష్ట‌మైన వ్యాప‌కం డ్యాన్సు. అందులోనూ కుర‌చ దుస్తులు వేసుకుని చిందులేయ‌డ‌మంటే మ‌రీ ఇష్టం. మీలో ఎవ‌రికి డ్యాన్సంటే ఇష్ట‌మో వారిని ట్యాగ్ చేయండి అని ఓ కామెంట్ ప‌డేసి... తాను చేసిన డ్యాన్సు వీడియోను అప్‌ లోడ్ చేస్తుంది. ఇప్ప‌టికి బోలెడు డ్యాన్సు వీడియోలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇలా డ్యాన్సులు చేసి చేసి చివ‌రికీ అమ్మ‌డు కొరియోగ్రాఫ‌ర్ గా మారినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఎందుకంటే ఆ డ్యాన్సుల్లో చాలా మ‌టుకు ఆమె సృష్టించిన స్టెప్పులే.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News