నవ్వులు పూయిస్తున్న కట్నం ఇబ్బందులు!
సప్తగిరి ఎక్స్‌ప్రెస్ అనే సినిమాతో హీరో అవతారమెత్తిన సప్తగిరి ఓ వైపు కామెడీ రోల్స్ చేస్తూనే మరోవైపు ఛాన్స్ వచ్చినప్పుడు హీరోగా నటిస్తున్నాడు.;
టాలీవుడ్ లో హీరోగా మారిన కమెడియన్స్ లో సప్తగిరి కూడా ఒకరు. మగజాతి ఆణిముత్యంగా సప్తగిరి తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించి కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ అనే సినిమాతో హీరో అవతారమెత్తిన సప్తగిరి ఓ వైపు కామెడీ రోల్స్ చేస్తూనే మరోవైపు ఛాన్స్ వచ్చినప్పుడు హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత సప్తగిరి మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పెళ్లి కాని ప్రసాద్ గా ఈసారి సప్తగిరి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాడు. మార్చి 21న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ టీజర్ వినోదభరితంగా ఉంది.
పెళ్లి కాని ప్రసాద్ గా సప్తగిరి పడే బాధలు, రూ.2 కోట్ల కంటే కట్నం రూపాయి తక్కువైనా ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకోని తండ్రితో సప్తగిరి పడే ఇబ్బందులతో టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. తమ వంశంలో ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే కచ్ఛితంగా కట్నం తీసుకోవాల్సిందేనని రూల్స్ బుక్ లో పెట్టుకున్న తండ్రితో తాను పడే ఇబ్బందులతో సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉండనున్నట్టు అర్థమవుతుంది.
కె.వై బాబు ఈ సినిమాను నిర్మించారు. ప్రభాస్ టీజర్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ మూవీకి డైరెక్టర్ మారుతి గైడెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.