ఫొటో స్టోరీ: హార్ట్ అటాక్ వచ్చేయదూ

Update: 2018-04-04 09:38 GMT
అమాయకమైన ముఖంతో... ఆకట్టుకునే చిరునవ్వుతో పక్కింటమ్మాయిలా కనిపించే లుక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. హోమ్లీగా కనిపించే క్యారెక్టర్లు రెండు.. మూడు సినిమాల్లో చేసింది. కాని చూడటానికి క్యూట్ గానే ఉన్నా ఆమె ఒంపుసొంపులు మాత్రం చాలా హాట్. అదే విషయం ప్రూవ్ చేయడానికి అన్నట్టు తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అదా శర్మ రీసెంగ్ గా ఓ యాట్ లో సముద్రంపై షికారుకెళ్లింది. ఈ సందర్భంగా ఫొటోకు ఫోజులిచ్చింది. మామూలుగా కాదు.. అతి పొదుపైన టూపీస్ బికినీల్లో అందచందాలన్నీ ఆరబోస్తూ.. రెడ్ కలర్ స్ట్రాప్స్ తో ఉన్న బికినీలో పడవపై నుంచుని సముద్రపు గాలులను ఎంజాయ్ చేస్తున్నట్టుగా అదా ఇచ్చిన ఫొజులును చూస్తే మతిపోవడం ఖాయం. సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించే ఫొటో షూట్ల విషయంలో ఎలాంటి లిమిట్స్ లేవన్న విషయం చెప్పకుండానే చెప్పేసింది. సిల్వర్ స్క్రీన్ పై స్కిన్ షో విషయంలో తనకు ఎలాంటి మొహమాటాలు లేవని ఈ ఫొటో షూట్ తో క్లారిటీ ఇచ్చేసింది.

‘‘విపరీతమైన గాలి... సముద్రం కల్లోలంగా ఉంది.. పడవ ఊగిపోతోంది. దీనికితోడు సీ సిక్ నెస్.. కానీ ఇది ఎంజాయ్ చేయాల్సిన తరుణం’’ అంటూ అదా ఫొటోతో పాటు తన ఫీలింగ్ షేర్ చేసింది.  సముద్రం కల్లోలంగా ఉంటే ఉండొచ్చు కానీ... నువ్వు ఈ రేంజిలో అందాలన్నీ ఆరబోస్తే చూసేవాళ్ల గుండెలు ఎంత కల్లోలమైపోతాయి. హార్ట్ అటాక్ లు వచ్చేయవూ... ఎంత ఖాళీగా ఉంటే మాత్రం మరీ ఇంతగా రెచ్చిపోవాలా అదా?

మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి
Tags:    

Similar News