‘‘మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ క్యారెక్టర్ చేయడానికి ఆదా శర్మ ఒప్పుకుంది. అది గెస్ట్ రోల్ కాదు, సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా కాదు. అదొక స్పెషల్ క్యారెక్టర్. నేను అడగ్గానే ఒప్పుకుని సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాకు ఆకర్షణ తెస్తున్నందుకు ఆదాకు చాలా పెద్ద థ్యాంక్స్’’.. ఇదీ ఫిబ్రవరి 23న డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ట్వీట్. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా చూసి.. ఈ ట్వీట్ గుర్తుకు తెచ్చుకుంటే నవ్వు రాక మానదు.
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ఈ సినిమాకు పని చేసిన చాలామందికి సంతోషమే మిగిల్చింది.. ఒక్క ఆదా శర్మకు తప్ప. ఎందుకంటే ఆమె పాత్ర అంత పేలవంగా, కామెడీగా ఉంది మరి. ఇప్పటికే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఆమె చేసిన కరివేపాకు క్యారెక్టర్ గురించి చాలా విమర్శలొచ్చాయి. పాపం ఆదాకు ఇలాంటి ప్రాధాన్యం లేని క్యారెక్టరా అన్నారు. ఇప్పుడు హరీష్ శంకర్ ఇంకా ఆమె స్థాయికి కిందికి తెచ్చేశాడు. ఆదా క్యారెక్టర్ గురించి అప్పట్లో అంత గొప్పగా చెప్పిన హరీష్.. ఆమెకు చాలా అన్యాయమే చేశాడు.
హైదరాబాదీ లోకల్ కామెడీ మూవీస్ లో చేస మస్త్ అలీ అనే కమెడియన్ ను ఆదాకు జోడీగా పెట్టడం దారుణం. మరీ ఆ పాత్రకు ఇంకెవరితోనైనా గెస్ట్ రోల్ చేయించాల్సిందేమో. కానీ మస్త్ అలీని పెట్టడం ద్వారా ఆదా స్థాయిని దిగజార్చేశాడు హరీష్. తెరమీద వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఆడియన్స్ కే అదోలా అనిపించినపుడు.. ఆదాకు ఎలా అనిపించిందో మరి. అసలే టాలీవుడ్ కెరీర్ అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో త్రివిక్రమ్ - హరీష్ ఆదాను దెబ్బ మీద దెబ్బ తీశారు. ఈ రెండు క్యారెక్టర్ల తర్వాత స్టార్ల సినిమాల్లో హీరోయిన్ వేషాలపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. మీడియం రేంజి హీరోలు కూడా ఆమె వైపు చూడ్డం కష్టమే.